A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
ఓ రిటైర్డ్ ప్రొఫెసర్ అంటూ కోదండరామ్పై కెటిఆర్..
Share |
May 27 2018, 5:26 pm

కాంగ్రెస్ నేతలపై తెలంగాణ మున్సిపల్ మంత్రి కెటిఆర్ తీవ్రంగా విరుచుకుపడ్డారు. విద్యార్దులను అడ్డం పెట్టుకుని శిఖండి రాజకీయాలు చేస్తున్నారని ఆయన కాంగ్రెస్ నేతలపై మండిపడ్డారు. మహబూబ్ నగర్ లో ఆయన ప్రసంగించారు. కొలువుల కొట్లాట ఎవరి కొలువుల కోసమని ప్రశ్నించారు. గతంలో కేంద్ర మంత్రిపదవి అనుభవించిన జైపాల్‌రెడ్డి, రాష్ట్రంలో మంత్రులుగా ఉన్న జానారెడ్డి, ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఇప్పుడు పదవులు లేక అల్లాడుతున్నారని, వారికి మళ్లీ కొలువుల (పదవులు) కోసమే ఇప్పుడు కొట్లాట చేస్తున్నారని ఎద్దేవాచేశారు. తెలంగాణ బిడ్డలకు ఉద్యోగాలిచ్చేవరకూ తమ ప్రభుత్వం వెనుకకుపోదని స్పష్టంచేశారు. 2004 నుంచి 2014 వరకు పాలించిన కాంగ్రెస్ నేతలు 9 వేల నుంచి 10 వేల ఉద్యోగాలే ఇచ్చారని గుర్తుచేసిన కేటీఆర్.. తెలంగాణ ప్రజలు మాకిచ్చిన 60 నెలల పాలనాకాలంలో లక్షా12వేల ఉద్యోగాలిస్తాం. ఈ విషయంలో తెలంగాణ బిడ్డలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు అని భరోసానిచ్చారు. పిల్లలను అడ్డు పెట్టుకుని శిఖండి రాజకీయాలు చేస్తున్నారు. కొందరు ప్రతిపక్ష నేతలు ఓ రిటైర్డ్ ప్రొఫెసర్‌ను పట్టుకుని కొలువుల కొట్లాట అంటూ సొంత పదవులకోసం నాటకాలాడుతున్నారు. 60 ఏండ్ల పాలనలో తెలంగాణకు ఎంతో అన్యాయం చేశారు. తెలంగాణకు శనిలా తయారయ్యారు అని కెటిఆర్ విమర్శించారు.

tags : ktr, kodandaram

Latest News
*టిడిపి ఉమ్మడిగా తిని ఒంటరిగా..పవన్ వ్యాఖ్య
*చంద్రబాబు ఎందుకు బయపడుతున్నారు
*తిరుమల వివాదం-బిజెపి కుట్ర- చంద్రబాబు
*హైదరాబాద్ నిర్మాణం చేశా- చంద్రబాబు
*టిడిపి అదైర్య పడే పరిస్థితి లేదు
*టిటిడి - బ్రాహ్మణ వివాదంలో చంద్రబాబు
*మంచి శాఖల కోసం పాట్లు-కుమారస్వామికి బొప్పి
*విప్లవ సినిమాల కేర్ ఆఫ్ అడ్రస్ ఇక లేరు
*వెంకయ్యనాయుడుది తిరిగే కాలు కదా..
*జగన్ ఎంత ఎత్తు ఎదిగారు..
*వెంకన్న కు కూడా కులం పూస్తారా-బిజెపి
*ఆంద్రవాళ్లూ కెసిఆర్ పాలన కోసం..
*దీక్షితులు -సోమిరెడ్డి వివరణ ఇచ్చారు కాని..
*ముద్రగడ లేఖాస్త్రం
*బిజెపి మళ్లీ గెలవదు-చంద్రబాబు
*మోడీ ప్రచార ప్రదానే..చంద్రబాబు ద్వజం
*బిజెపిది నమ్మక ద్రోహం- చంద్రబాబు
*వైసిపిలో కి ఇద్దరు ప్రముఖులు
*నా వల్లే ఎపిలో టిడిపి గెలిచింది- చంద్రబాబు
*తెలంగాణలో టిడిపి కింగ్ మేకర్ అంటే అర్దం ..
*మోడీకి ఎ ప్లస్ గ్రేడ్ ఇచ్చిన రాహుల్
*చంద్రబాబుపై పవన్ ఘాటు వ్యాఖ్య
*అర్చకత్వం అంటే ఎమ్మెల్యేలను కొనడం కాదు
*చంద్రబాబును ఎవరైనా నమ్ముతారా
*టిడిపిలో దళితులకు అవమానం..టిఆర్ఎస్
*ప్రజలలో సంతృప్తి పెరిగిందట
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info