A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
దేశానికే ఆదర్శంగా తెలంగాణ స్థానిక చట్టం
Share |
September 22 2018, 12:19 pm

హైద‌రాబాద్‌-తెలంగాణా ప్ర‌భుత్వం  రూపొందించ‌నున్న కొత్త పంచాయ‌తీరాజ్ చ‌ట్టంతో దేశానికే ఆద‌ర్శంగా తెలంగాణాలో స్థానిక పాల‌న సాగాల‌ని పంచాయ‌తీరాజ్ మరియు గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి జూప‌ల్లి కృష్ణారావు అన్నారు. గ‌త కొన్ని రోజులుగా నూత‌న పంచాయ‌తీరాజ్ చ‌ట్ట రూప‌క‌ల్ప‌న‌పై ప్ర‌భుత్వం ఏర్పాటు చేసిన క‌మిటీ క‌స‌ర‌త్తు చేస్తుండ‌గా... ఈ క‌మిటీతో సిపార్డులో శ‌నివారం మంత్రి జూప‌ల్లి కృష్ణారావు స‌మావేశ‌మ‌య్యారు. ఇప్ప‌టివ‌ర‌కు చ‌ట్టంలో  పొందుప‌ర్చేందుకు సిద్దం చేసిన ప‌లు అంశాల‌పై కూలంకుశంగా చ‌ర్చించి ...ప‌లు
సూచ‌న‌లు చేశారు. ప్ర‌ధానంగా గ్రామ‌స‌భ‌ల నిర్వ‌హ‌ణ‌తో పాటు...స‌ర్పంచ్‌ల విధులు, బాధ్య‌త‌ల అంశాల‌పై చ‌ట్టంలో చేయాల్సిన మార్పుల‌పై దిశానిర్దేశం చేశారు. సియం కేసీఆర్ ఆలోచ‌నా విధానాల‌కు అనుగుణంగా స్థానిక పాల‌న‌ను కొత్త పుంత‌లు తొక్కించేలా చ‌ట్టానికి రూప‌క‌ల్ప‌న చేయాల్సిన అవ‌స‌రం ఉంద‌న్నారు.ఇందుకోసం దేశంలోని వివిధ రాష్ట్రాల‌తో పాటు...విదేశాల్లోని స్థానిక పాల‌న‌లో ఉన్న అన్ని అంశాల‌ను ప‌రిశీలించి
మెరుగైన చ‌ట్టాన్ని రూపొందించాల‌న్నారు. అధిక జ‌నాభా ఉన్న గ్రామాల్లో వార్డు స‌భ‌ల ఏర్పాటు దిశ‌గా కూడాఆలోచ‌న చేయాల‌న్నారు. గ్రామ సభ‌ల‌ను నామ మాత్రంగా కాకుండా ప‌క‌డ్బంధీగా నిర్వ‌హించేలా చ‌ట్టంలోవిధివిధానాలు రూపొందించాల‌ని సూచించారు. స్థానిక సంస్థ‌ల ప్ర‌జాప్ర‌తినిధుల విధులు, బాధ్య‌త‌ల‌పై స్ప‌ష్ట‌మైన అవ‌గాహ‌న ప్రతి ఒక్క‌రికి ఉండేలా చ‌ట్టాన్ని స‌ర‌ళంగా రూపొందించే అంశాన్ని ప‌రిశీలించాల‌న్నారు. తెలంగాణా
ప్ర‌భుత్వం రూపొందించ‌బోయే చ‌ట్టం స్థానిక పాల‌న‌లో ఒక మైలురాయిగా నిలువాల‌ని...దీని ద్వారా ప్ర‌జ‌ల‌కుమ‌రింత మెరుగైన సేవ‌లు అందాల‌న్నారు. స‌మావేశంలో క‌మిటీ వైస్ చైర్మ‌న్ చెల్ల‌ప్ప‌, స‌భ్యులు నీతూ కుమారి
ప్ర‌సాద్‌, రామారావు, వెస్లీ, సుధాక‌ర్‌, శేషాద్రి త‌దిత‌రులు పాల్గొన్నారు.

tags : jupalle, panchayat raj

Latest News
*చంద్రబాబుకు నాన్ వెజ్ బిర్యాని పంపుతారా
*తండ్రి నటుడు,కూతురు నటి- ఇద్దరి మద్య గొడవ
*మిషన్ భగీరద పేరుతో 50 వేల కోట్ల అప్పు
*ఈనాడు ఆ ప్రశ్న వేయలేదా
*చంద్రబాబు నిండా ముంచారు
*చెవిలో పూలు,చేతిలో చిప్ప- బిజెఇ నిరసన
*కెసిఆర్ కుటుంబాన్ని తరిమికొట్టాలన్న ఉత్తం
*మోడీ అంటే చంద్రబాబుకు భయం
*సైనికుల రక్తాన్ని మోడీ అవమానించారు
*పడన ప్రమాదం- 130 మంది మృతి
*నాలుగేళ్లలో అమరావతి కట్టలేదే-కెటిఆర్ ఎద్దేవ
*న్యూజెర్సీలో టిడిపి బహిరంగ సభకు చంద్రబాబు
*రాహుల్ ఎపి ప్రజల కళ్లలో కళ్లు పెట్టగలరా
*మాది తెలంగాణ పార్టీ- టిడిపి నేత ప్రకటన
*కాంగ్రెస్ కు ఏది ఆ చిత్తశుధ్ది
*ఇక్కడ గెలిపించకపోతే క్యాబినెట్ లో చేరను
*కాంగ్రెస్,టిడిపి సీట్ల పంపిణీ తేలేనా
*అనేక కేసుల్లో బాబు స్టే తెచ్చుకున్నారుగా
*యుపిలో ఎస్సి,బిఎస్పి కలిస్తే కష్టమే-సర్వే
*రాఫెల్ డీల్- మోడీ చిక్కుల్లో పడతారా
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info