A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
ఎమ్మెల్యేల‌కు మంత్రి ఇంద్ర‌క‌ర‌ణ్ రెడ్డి లేఖ 
Share |
December 11 2017, 10:31 pm

ధూప దీప నైవేద్య ప‌థ‌కం అమ‌లుకు తోడ్పాటునందించాల‌ని కోరిన మంత్రి   
హైదరాబాద్:  ధూప దీప నైవేద్య ప‌థ‌కాన్ని స‌మ‌ర్థ‌వంత‌గా అమ‌లు చేయుట‌కు తోడ్పాటునందించాల‌ని గృహ నిర్మాణ‌,న్యాయ‌,దేవాదాయ శాఖ మంత్రి ఇంద్ర‌క‌ర‌ణ్ రెడ్డి  ఎమ్మెల్యేలను కోరారు. ఈ మేరకు మంత్రి ఇంద్ర‌క‌ర‌ణ్ రెడ్డి ఎమ్మెల్యేలకు లేఖ రాశారు. ప్ర‌జా ప్ర‌తినిదులు, వివిధ గ్రామ ప్ర‌జ‌ల నుంచి వ‌స్తున్న విజ్ఞాప‌న‌ల మేర‌కుధూప దీప నైవేద్య ప‌థ‌కాన్ని మ‌రిన్ని ఆల‌యాల‌కు వ‌ర్తింప‌జేయాల‌ని ముఖ్య‌మంత్రి నిర్ణ‌యం
తీసుకున్నార‌న్నారు. ముఖ్య‌మంత్రి ఆదేశాల మేర‌కు ధూప దీప నైవేద్య ప‌థకాన్ని కొత్త‌గా మ‌రో 3 వేల  ఆల‌యాల‌కు వ‌ర్తింప‌జేస్తూ దేవాదాయ శాఖ  జీవో (G.o.Ms.No..248.dt 08-11- 2017) జారీ చేసింద‌ని లేఖ‌లో
పేర్కొన్నారు. నిర్ధేశించిన నియ‌మ నిబంధ‌న‌ల  ప్ర‌కారం డిసెంబ‌ర్ 8,2017 తేది లోగా అర్చ‌కులు ధూప దీప నైవేద్య ప‌థ‌కంకు ద‌ర‌ఖాస్తు చేసుకోవాల‌ని చెప్పారు. ఆల‌యాల్లో ప‌ని చేస్తున్న అర్చ‌కులు జిల్లా సంబంధిత
దేవాదాయ శాఖ అసిస్టెంట్ క‌మిష‌న‌ర్ కు ద‌ర‌ఖాస్తు చేసుకోవాల‌ని సూచించారు. ప్ర‌భుత్వం నియ‌మించిన జిల్లా
స్థాయి క‌మిటీ  వ‌చ్చిన దర‌ఖాస్తుల‌ను ప‌రిశీలించి,అర్హ‌త క‌లిగిన దేవాల‌యాల‌ను ఎంపిక చేస్తుంద‌ని
వివ‌రించారు. మ‌రోవైపు ప్ర‌సిద్ధ పుణ్య క్షేత్రాల‌ను  అభివృద్ది చేయ‌డంతో పాటు మారుమూల ప‌ల్లెల్లో నిరాధ‌ర‌ణ‌కు
గురైన  ఆల‌యాల్లో నిత్య పూజ‌లు జ‌ర‌గడానికి తెలంగాణ ప్ర‌భుత్వం తీసుకుంటున్న‌ చ‌ర్య‌లను వివ‌రించారు.
గతంలో ధూప దీప ప‌థ‌కం ద్వారా 1805 ఆల‌యాలకు రూ. 2500 ఇస్తే ముఖ్య‌మంత్రి కేసీఆర్ రూ.6000 ల‌కు
పెంచార‌న్నారు.

tags : indrakaranreddy, letter

Latest News
*కేంద్రం కొత్త బిల్లు- బ్యాంకు డిపాజిట్లపై వివరణ
*చంద్రబాబు మళ్లీ పాతపాట పాడారు
*విజయ్ ఆత్మహత్య కేసులో పారిశ్రామికవేత్త పేరు
*కెసిఆర్ వియ్యంకుడు అక్రమ రిజర్వేషన్ పొందారు
*పోలవరం లో ఇంత గందరగోళమా- బుగ్గన
*చైతన్యబారతి కాలేజీలో ఉద్రిక్తత
*ప్రకాష్ రాజ్ పై ఇతర రాష్ట్రాలకు కోపం వస్తుందేమో
*జగన్ చుట్టూ పద్మవ్యూహం అల్లినా..
*పటేళ్ల పోస్టర్లు- బిజెపి గిజగిజ
*వంట గ్యాస్ ధరలు ఈ ఒక్క నెల పెరగలేదంటే..
*సోనియాగాందీనే సస్పెండ్ చేయాలట
*పోలవరంలో పెరిగిన అంచనా ప్రజలపై వేయరాదు
*పట్టిసీమ ప్రచారం- తెలంగాణకు పెద్ద అస్త్రం !
*సుప్రింకర్టుకు వెళతామంటున్న మంత్రి
*ఎట్టకేలకు భరత్ రెడ్డి అరెస్టు?
*మోడీ వ్యాఖ్యలకు బాధపడ్డ మన్మోహన్ సింగ్
*న్యూయార్క్ టైమ్ స్క్వేర్ వద్ద బాంబు పేలుడు
*ఇక కాంగ్రెస్ అద్యక్షుడు రాహుల్ గాంధీ
*ఒకరు ఒకే చోట పోటీచేయాలా-పిల్
*పోలవరం బిల్లులు పెండింగులో ఉండవు-గడ్కరి
*కమెడియన్ విజయ్ ఆత్మహత్య
*మోడీకి పాకిస్తాన్ జవాబు
*పవన్ కళ్యాణ్ పై ఎన్నో సందేహాలు
*అవినీతి గత ఏడాది కాలంలో తగ్గలేదా
* త్రిపుల్ తలాఖ్ పై హిస్టరీ పేపర్ లో ప్రశ్నలు
*నోట్ల రద్దు, జిఎస్టి ప్రభావం మరో రెండేళ్లు
*బిసి రిజర్వేషన్ లు-ఇదేనా బిజెపి చిత్తశుద్ది
*తెలుగు మహాసభలు-50 కోట్ల ఖర్చా
*రాహుల్ ఆ ఫైల్ పైనే సంతకం చస్తారు
*ఇళ్లు-ఎపికి కేంద్రం అన్యాయం- జ్యోతి
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info