A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
సింగపూర్ ను అందుకునే యత్నం-చంద్రబాబు
Share |
February 25 2018, 5:04 am

ఆంద్ర ప్రదేశ్ సింగపూర్ ను అందుకోవడానికి ప్రయత్నిస్తోందట. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ విషయం చెప్పారు.సింగపూర్ మంత్రి ఈశ్వరన్ తో సమావేశం సందర్భంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. అభివృద్ధిలో దూసుకుపోతున్న సింగపూర్‌ను అందుకోవడానికి ప్రయత్నిస్తున్నామని ఆయన అన్నారు. వినూత్న ఆలోచనలు, ఆవిష్కరణలకు సింగపూర్‌ ముఖద్వారంగా వుందని, అక్కడ అమలు చేసే ఉత్తమ విధానాల్ని తమ రాష్ట్రంలోనూ అమలు చేయాలని ఆ దేశ ప్రభుత్వాన్ని కోరారు. రాజధాని పేరుతో ఒక కాంక్రీట్‌ జంగిల్‌ నిర్మించాలనుకోవట్లేదని, ఇక్కడి సహజసిద్ధమైన వనరుల్ని ఉపయోగించుకుంటూనే ఆధునిక టెక్నాలజీతో అద్భుత రాజధాని నిర్మించాలనేది తమ ప్రయత్నమని చెప్పారు. రాబోయే రోజుల్లో అమరావతిలో ఎలక్ట్రిక్‌ వాహనాలకు అధిక ప్రాధాన్యమిస్తామన్నారు. త్వరలో 1,500 ఎలక్ట్రిక్‌ వాహనాలు ప్రవేశపెడుతున్నామని ఆయన తెలిపారు.

tags : chandrababu, singapore

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info