A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
బాలకృష్ణకు ఘాటు రిప్లై ఇచ్చిన వైసిపి ఎమ్మెల్యే
Share |
December 14 2018, 12:02 pm

తనకు పిచ్చి ఉందని సర్టిఫికెట్ తీసుకుని హిందుపూర్ టిడిపి ఎమ్మెల్యే ,నటుడు బాలకృష్ణ ఒక కేసు నుంచి తప్పించుకున్నది వాస్తవం కాదా నెల్లూరు ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్ విమర్శించారు.విపక్ష నేత జగన్ పాదయాత్ర ను బాలకృస్ణ విమర్శించడాన్ని ఆయన తప్పుపడుతూ తన తండ్రికి అవమానం జరుగుతుంటే కాపాడలేని వ్యక్తి బాలకృష్ణ అయితే, పులి లాంటి తండ్రికి పుట్టిన బిడ్డ జగన్ పులి మాదిరే పోరాటాలు చేస్తున్నారని ఆయన అన్నారు.తండ్రికి వెన్నుపోటు పొడిచిన బావకు మద్దతు ఇచ్చిన ఘనత బాలకృష్ణది అయితే తండ్రి కి పేరు తెచ్చేలా పనిచేస్తున్న చరిత్ర జగన్ ది అని అన్నారు. తెలుగుదేశం కొండను ఎవరూ డీకొనలేరని బాలకృష్ణ అన్నారని, పదేళ్ల పాటు వైఎస్ దెబ్బకు ప్రతిపక్షంలో టిడిపి ఉన్న సంగతి బాలకృష్ణ మర్చిపోయారా అని ఆయన ప్రశ్నించారు. దొంగ హామీలు ఇచ్చి,మోసపూరిత వాగ్దానాలతో ,మోడీ,పవన్ కళ్యాణ్ కాళ్లు పట్టుకుని అదికారంలోకి వచ్చారని అన్నారు. ఒక మహనీయుడుకు ఎలాంటి కొడుకులు పుట్టకూడదో చెప్పడానికి బాలకృష్ణ ఉదాహరణ అని అన్నారు.తండ్రిని చెప్పులతో కొట్టినా చూస్తూ ఊరుకున్న వ్యక్తి బాలకృష్ణ అని ఆయన అన్నారు. చంద్రబాబు గజమోసగాడుగా దేశంలోనే గుర్తింపు పొందారని అనిల్ కుమార్ యాదవ్ విమర్శించారు.అలాంటి చంద్రబాబుకు బాలకృష్ణ మద్దతు ఇవ్వడం సిగ్గుచేటు అని ఆయన అన్నారు. కొండనైనా జగన్ డీకొంటే అది పిండి కాకతప్పదని ఆయన అన్నారు.

tags : anilkumaryadav, balakrishna

Latest News
*7 గురు కొత్త ఎమ్మెల్యేలపై హత్యాయత్నం కేసులు
*చంద్రబాబు జోక్యం-సిపిఎం విశ్లేషణ
*ఎపిలో కెసిఆర్ ప్లెక్సీని పెట్టనివ్వరా
*ఎమ్.పిలందరికి మళ్లీ టిక్కెట్లు- కెసిఆర్
*కెసిఆర్ కు తాడు ,బొంగరం లేదట
*ఉత్తం సవాల్ మరిచారా
*కాంగ్రెస్ అబద్దపు హామీలు ఇచ్చింది
*టి.అసెంబ్లీలో 24 మంది కొత్త వారు
*కారు బదులు ట్రక్- ఓడిన నేతలు
*కాంగ్రెస్ కు ఓట్లు పెరిగాయి..సీట్లు తగ్గాయి
*ప్రతిపక్ష నేత హోదా కోసం కాంగ్రెస్ లో పోటీ
*రఫెల్ డీల్-బిజెపికి ఊరట-కాంగ్రెస్ కు దెబ్బ
*కెసిఆర్ కు ఎపి టిడిపి గట్టి వార్నింగ్ ఇస్తోందా
*ముస్లింలలో చీలిక తేవడానికి బాబు యత్నం
*మళ్లీ తారా చౌదరి వార్తలలోకి వచ్చారు
*నాయిని మంత్రి అవుతారా?ఏ శాఖ ఇస్తారో
*ఎపిలో ఇళ్ల నిర్మాణానికి 14వేల కోట్లు -కేంద్రం
*అదికారంకోసం అర్రులు చాచం-భట్టి
*నటులకు ఓట్లు రాలవన్న ప్రముఖ నటి
*ఇండిపెండెంట్లను ముంచిన లగడపాటి
*లోక్ సభ ఎన్నికలకూ కూటమి ఉండాలన్న నేత
*కాంగ్రెస్,టిడిపి సమన్వయంగా పనిచేయలేదు
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info