A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
రాక్షసులు అడ్డుపడుతున్నారు-చంద్రబాబు
Share |
February 25 2018, 5:00 am

ఎపి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తన నిర్ణయాలను వ్యతిరేకించేవారిని రాక్షసులు అని అంటున్నారు.హరిత ట్రిబ్యునల్ రాజధాని విషయంలో తమకు అనుకూలమైన తీర్పు ఇచ్చిందని ఆయన చెబుతున్నారు.నది పక్కన నిర్మాణం చేస్తామంటే కొందరు అనేక అడ్డంకులు పెడుతున్నారని ఆయన అన్నారు. యజ్ఞాన్ని అడ్డుకొనే రాక్షసుల్లా కొందరు రాజధాని నిర్మాణాన్ని అడ్డుకొనే ప్రయత్నం చేస్తున్నారని చంద్రబాబు వ్యాఖ్యానించారు. ఎవరెన్ని అడ్డంకులు సృష్టించినా రాజధాని నిర్మాణం మాత్రం ఆగదని అన్నారు. అమరావతి ప్రాంతంలో పచ్చదనం ప్రాజెక్టు ను ఆయన ప్రారంభించిన సందర్భంగా ప్రసంగించారు. రాజధాని ఫలాలు ప్రజలకు అందించి తీరుతామన్నారు. 99శాతం మంది ఓ వైపు ఉంటే, ఆ ఒక్కరు మరోవైపు ఉంటున్నారని, ఎవరెన్ని అడ్డంకులు సృష్టించినా ప్రపంచం మెచ్చే రాజధాని తీరతామని ఆయన అన్నారు.

tags : chandrabau, amaravati

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info