A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
ఎసిపబిపై కి కుక్కలను వదలిన అదికారి
Share |
June 24 2018, 1:05 am

ఎపిలో అవినీతి నిరోధక శాఖ అదికారులపై ఒక అదికారి కుక్కలను వదలిపెట్టాడట. దాంతో వారు కొంత సేపు పరుగులు తీయాల్సి వచ్చిందట. విశాఖ భూమి కుంభకోణంతో పాటు, సర్వేల తారుమారు చేశారన్న అబియోగం ఎదుర్కుంటున్న గెదెల గణేశ్వరరావు అనే అతని ఇంటిపైకి ఎసిబి అదికారులు దాడులు చేయగా, తొలుత అతను కుక్కలను వదలిపెట్టాడని, దాంతో వారు పరుగులు పెట్టవలసి వచ్చిందని సమాచారం వచ్చింది. అతేకాక రెండు గంటలపాటు అతను కనిపించకుండా పోయాడట. ఆ తర్వాత అతను అపార్టుమెంట్ పెంట్ హౌస్ లో దాక్కున్నాడని గమనించారు. ఇంటికి వేసి ఉన్న తాళాన్ని పోలీసుల సహకారంతో పగులకొట్టి లోనికి వెళ్లారు. మొత్తం పదిహేడు చోట్ల ఈ సోదాలు నిర్వహించారు. హైదరాబాద్,విజయనగరం, విశాఖపట్నం తదితర ప్రాంతాలలో ఈ సోదాలు సాగాయి.విశాఖ భూ కుంభకోణఃలో అరెస్టు అయి బయటకు వచ్చిన ఇతను సస్పెన్షన్ లో ఉన్నాడు.దాడులలో పలు డాక్యుమెంట్లు దొరికాయని సమాచారం.

tags : ap, acb

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info