A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
పురందేశ్వరి,కన్నా డూప్లికేట్ బిజెపి నాయకులు-మంత్రి
Share |
June 24 2018, 1:04 am

బిజెపిలో ఉన్న మాజీ మంత్రులు పురందేశ్వరి, కన్నా లక్ష్మీనారాయణలు డూప్లికేట్ బిజెపి నేతలని తెలుగుదేశం నేత, మమంత్రి అయ్యన్నపాత్రుడు వ్యాఖ్యానించారు.పోలవరం ప్రాజెక్టుకు సంబందించి పురందేశ్వరి, కన్నాలు చేసిన వ్యాఖ్యలపై ఆయన మండిపడ్డారు. పోలవరం ప్రాజెక్టులో కాఫర్‌ డ్యాం గురించి మాట్లాడడానికి ఆమె ఇంజనీరా? ఆమెకేం తెలుసని ప్రశ్నించారు.మరో బీజేపీ నాయకుడు కన్నా లక్ష్మీనారాయణ కూడా పోలవరం ప్రాజెక్టుపై అవగాహన లేకుండా మాట్లాడుతున్నారన్నారు. బీజేపీలో ఉన్న సిసలైన నాయకులెవరూ పోలవరం ప్రాజెక్టు గురించి వ్యతిరేకంగా మాట్లాడడం లేదని, కాంగ్రెస్‌ పార్టీ నుంచి కొత్తగా బీజేపీలో చేరిన వీరు డూప్లికేట్‌ నాయకులని ఎద్దేవా చేశారు. పోలవరం ప్రాజెక్టుకు నిధులు రాకుండా వీరు అడ్డుకోవడానికి ప్రయత్నిస్తున్నారని అయ్యన్నపాత్రుడు విమర్శించారు. వీరికి సత్తా ఉంటే విమర్శలు మాని కేంద్రం నుంచి పోలవరానికి, రాష్ట్రానికి ఎక్కువ నిధులు తీసుకురావాలని ఆయన అన్నారు.

tags : ayyannapatrudu, purandeswari

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info