A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
నా కుమారుడు సబ్ కాంట్రాక్టు చేస్తే తప్పేంటి-మంత్రి
Share |
December 14 2018, 10:57 am

పర్యాటక శాఖకు సంబందించిన ఒక టెండర్ కు సంబందించి సబ్ కాంట్రాక్ట తన కుమారుడు తీసుకుంటే తప్పేంటని ఎపి మంత్రి జవహార్ ప్రశ్నించారని ఒక కధనవ ంచ్చింది.ఎపిలో ఇటీవలి కాలంలో అన్ని కాంట్రాక్టులు, సబ్ కాంట్రాక్టులు టిడిపి నేతలు, పదవులలో ఉన్నవారే ఎదో విధంగా దక్కించుకుంటున్నారని ఆరోపణలు వస్తున్న నేపధ్యంలో మంత్రి ప్రకటనకు ప్రాధాన్యం ఏర్పడింది.దీనికి సంబందించి మీడియాలో వచ్చిన ఒక కధనం ఇలా ఉంది.

పశ్చిమగోదావరి జిల్లా కొవ్వూరు ఆధ్యాత్మిక కేంద్రం. ఇక్కడ పాత రైలువంతెన నుంచి రోడ్డు కం రైలు బ్రిడ్జి వరకు గోదావరి నదీతీరంలో 9.90 ఎకరాల భూమి ఉంది. జలవనరుల శాఖకి చెందిన ఈ భూమిని ఇటీవలే పర్యాటక శాఖకి బదలాయించారు. ఈ భూముల్లో కాటేజ్‌లు, బార్‌ అండ్‌ రెస్టారెంట్, పుడ్‌ కోర్టులతో పాటు కల్చరల్‌ సెంటర్‌ ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. దీనిలో భాగంగా రూ.7.75 కోట్ల నిధులను ప్రభుత్వం విడుదల చేసింది. ఈ పనులకు గత నెలలోనే టెండర్లు ప్రక్రియ ముగిసింది. హైదరాబాద్‌కి చెందిన ఎన్‌జేఆర్‌ (ఎన్‌.జనార్ధన్‌రావు) కనస్ట్రక్షన్స్‌ పనులు దక్కించుకున్నట్టు పర్యాటక శాఖ అ«ధికారులు చెబుతున్నారు. వాస్తవంగా ఈ పనులను బినామీ కాంట్రాక్టర్ల పేర్లతో అధికార పార్టీ నేతలే సొంతం చేసుకున్నారు.


దీనిలో రాష్ట్ర మంత్రి కుమారుడికి వాటా ఉందన్న ప్రచారం సాగుతోంది. దీనిపై మంత్రి జవహర్‌ స్పందిస్తూ తన కుమారుడు సబ్‌కాంట్రాక్ట్‌ తీసుకుంటే తప్పేమిటని ప్రశ్నించడంతో ఈ వ్యవహారం ఆయన కనుసన్నల్లో జరిగినట్లు స్పష్టం అవుతోంది. ఈ భూముల్లో కాటేజ్‌లు, రెస్టారెంట్, కల్చరల్‌ సొసైటీ వంటి నిర్మాణాలు ప్రభుత్వ ఖర్చులతో నిర్మించిన తర్వాత వీటి నిర్వహణను 33 ఏళ్ల పాటు లీజుకు తీసుకున్నట్లు ప్రచారం జరుగుతోంది. అయితే పర్యాటక అధికారులు మాత్రం లీజు వ్యవహారంపై నోరుమెదపడం లేదు. ఈ వ్యవహారమంతా రాష్ట్ర ప్రభుత్వ స్థాయిలోనే ఉంటుందని చెబుతున్నారు. కేవలం ఈ భూముల్లో నిర్మాణాల వరకే తాము పరిమితమంటున్నారు. ఇప్పటికే ఈ భూములను శుభ్రం చేసే పనులు పూర్తయ్యాయి. ఈ భూముల్లో ప్రస్తుతం 24 కాటేజీలు, ఒక బార్‌ అండ్‌ రెస్టారెంట్, పుడ్‌కోర్టు నిర్మాణం చేస్తున్నారు.
విగ్రహాల తొలగింపు వివాదాస్పదం
శ్రీనివాస స్నానఘట్టంలో ఈ భూములను ఆనుకుని ఉన్న శివుడు, వినాయకుడు, నందీశ్వరుడితో పాటు రావణబ్రహ్మ విగ్రహాలు తొలగించడం ఇప్పుడు వివాదాస్పదంగా మారింది. గడిచిన 3 రోజుల నుంచి విగ్రహాల తొలగింపుపై భక్తులు, వైఎస్సార్‌సీపీ మద్దతుతో ఆందోళనలు చేస్తున్నారు. గురువారం నిర్వహించిన నిరసన ర్యాలీకి కాంగ్రెస్‌ పార్టీ మద్దతు పలికింది. ఇప్పటికే టీడీపీ మిత్రపక్షమైన బీజేపీ సైతం విగ్రహాల తొలగింపుని తప్పుబట్టింది. కాపు ఉద్యమ నేత, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం ఈ ఆందోళనలకు మద్దతు పలికారు.

వ్వూరులో శ్రీనివాస స్నానఘట్టంలో ఏర్పాటు చేసిన శివలింగం, నందీశ్వరుడు, గణపతి విగ్రహాల తొలగింపు విషయం పత్రికల్లో చూశానని, దేవతామూర్తుల విగ్రహాల తొలగింపునకు చింతిస్తున్నానని మంత్రి కేఎస్‌ జవహర్‌ అన్నారు

tags : ap, jawahar,minister,sub contract

Latest News
*7 గురు కొత్త ఎమ్మెల్యేలపై హత్యాయత్నం కేసులు
*చంద్రబాబు జోక్యం-సిపిఎం విశ్లేషణ
*ఎపిలో కెసిఆర్ ప్లెక్సీని పెట్టనివ్వరా
*ఎమ్.పిలందరికి మళ్లీ టిక్కెట్లు- కెసిఆర్
*కెసిఆర్ కు తాడు ,బొంగరం లేదట
*ఉత్తం సవాల్ మరిచారా
*కాంగ్రెస్ అబద్దపు హామీలు ఇచ్చింది
*టి.అసెంబ్లీలో 24 మంది కొత్త వారు
*కారు బదులు ట్రక్- ఓడిన నేతలు
*కాంగ్రెస్ కు ఓట్లు పెరిగాయి..సీట్లు తగ్గాయి
*ప్రతిపక్ష నేత హోదా కోసం కాంగ్రెస్ లో పోటీ
*కెసిఆర్ కు ఎపి టిడిపి గట్టి వార్నింగ్ ఇస్తోందా
*ముస్లింలలో చీలిక తేవడానికి బాబు యత్నం
*మళ్లీ తారా చౌదరి వార్తలలోకి వచ్చారు
*నాయిని మంత్రి అవుతారా?ఏ శాఖ ఇస్తారో
*ఎపిలో ఇళ్ల నిర్మాణానికి 14వేల కోట్లు -కేంద్రం
*అదికారంకోసం అర్రులు చాచం-భట్టి
*నటులకు ఓట్లు రాలవన్న ప్రముఖ నటి
*ఇండిపెండెంట్లను ముంచిన లగడపాటి
*లోక్ సభ ఎన్నికలకూ కూటమి ఉండాలన్న నేత
*కాంగ్రెస్,టిడిపి సమన్వయంగా పనిచేయలేదు
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info