A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
72 గంటలలో సమస్యల పరిష్కారం-జగన్
Share |
November 18 2018, 9:00 am

గ్రామాలలో ఎదురయ్యే చిన్న,చిన్న సమస్యలన్నిటికి అదే గ్రామంలో పరిష్కారం అయ్యేలా గ్రామ సచివాలయాలు ఏర్పాటు చేస్తామని విపక్ష నేత ,వైఎస్ ఆర్ కాంగ్రెస్ అదినేత జగన్ హామీ ఇచ్చారు. వచ్చే ఎన్నికలలో తమ పార్టీ గెలిస్తే ప్రజలకు ఎలాంటి కులం,మతం, ప్రాంతం, పార్టీల బేదాల తేడా లేకుండా సమస్యలు తీర్చే విదంగా గ్రామ సచివాలయాలను ఏర్పాటు చేస్తామని ఆయన అన్నారు. డెబ్బై రెండు గంటలలో ఆ సమస్య పరిష్కారం కావాలని ఆదేశిస్తామని ఆయన చెప్పారు. పెన్షన్ కోసం ఎమ్మెల్యే చుట్టూనో, మరో నేత వద్దకో, లేక జన్మభూమి కమిటీలకో డబ్బు ఇవ్వవలసిన అవసరం లేకుండా ఈ సచివాలయం పనిచేస్తుందని, అన్ని సమాజిక వర్గాల ప్రతినిదులకు ఇందులో అవకాశం కల్పిస్తామని ఆయన అన్నారు. పీజ్ రీయింబర్స్ మెంట్ , స్కాలర్ షిప్ వంటివి ఏవి కావాలన్న గ్రామంలోనే మంజూరు అయ్యేలా చర్యలు తీసుకుంటామని అన్నారు. కర్నూలు జిల్లాలోపాదయాత్ర ప్రవేశించిన సందర్భంగా ఒక దివ్యాంగుడు వచ్చి తనకు పెన్షన్ ఇవ్వకుండా అదికారులు ఇబ్బంది పెడుతున్నారని ఫిర్యాదు చేశారు.దీనిపై ఆయన స్పందించి,ఇప్పటికైనా రాజకీయాలకు అతీతంగా పెన్షన్లు ఇవ్వాలని, దేవుడు చంద్రబాబుకు ఆ రకంగా బుద్ది ప్రసాదించాలని కోరుకుంటున్నానని జగన్ చెప్పారు.

tags : jagan,secretariat

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info