A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
తెలంగాణలో లక్ష కెసిఆర్ కిట్లు పంపిణీ
Share |
November 18 2017, 11:16 pm

తెలంగాణ ఆడ‌వాళ్ళ ఆత్మ‌గౌర‌వాన్ని ఇనుమ‌డింప చేస్తూ, అన‌వ‌స‌ర ఆప‌రేష‌న్ల‌ని త‌గ్గిస్తూ,
సుఖ‌, స‌హ‌జ ప్ర‌స‌వాల‌ను ప్రోత్స‌హిస్తూ, ఆరోగ్య‌ తెలంగాణ సాధ‌న దిశ‌గా, ప్ర‌భుత్వం ప్ర‌తిష్టాత్మ‌కంగా ప్ర‌వేశ‌పెట్టిన కెసిఆర్ కిట్ల ప‌థ‌కం అన‌తి కాలంలోనే ల‌క్ష కిట్ల ల‌క్ష్యాన్ని చేరుకోవ‌డం అత్యంత శుభ దాయ‌క‌మ‌న్నారు వైద్య ఆరోగ్య‌శాఖ మంత్రి డాక్ట‌ర్ సి ల‌క్ష్మారెడ్డి. ఇదే స‌మ‌యంలో న‌వంబ‌ర్ 14 పిల్ల‌ల దినోత్స‌వం కావ‌డం యాదృచ్చికంగా క‌లిసి వ‌చ్చిన అంశ‌మ‌ని, ఈ సంద‌ర్భంగా త‌ల్లుల‌కూ, పిల్ల‌ల‌కూ, కాబోయే త‌ల్లుల‌కు, ఈ
ప్ర‌పంచంలోకి రాబోయే పిల్ల‌ల‌కు కూడా మంత్రి శుభాకాంక్ష‌లు, అభినంద‌న‌లు తెలిపారు.  
కెసిఆర్ కిట్ల ప‌థ‌కం అత్యున్న‌త ల‌క్ష్యమైన ఆరోగ్య తెలంగాణ సాధ‌న కోసం సీఎం కెసిఆర్ చేప‌ట్టిన అద్భుత ప‌థ‌కంగా మంత్రి  చెప్పారు. బిడ్డ క‌డుపులో ప‌డ్డ నాటి నుండి బిడ్డ పుట్టిన 9 నెల‌ల వ‌ర‌కు పూర్తిగా ప్ర‌భుత్వ పౌష్టికాహారం, వైద్య ప‌రీక్ష‌లు, స‌హాయం, టీకాలు వంటి అంశాల‌తో ముడిప‌డి ఈ ప‌థ‌కం రూపొందించ‌డం
జ‌రిగింద‌న్నారు. దీంతో గ‌ర్బిణీ సాధార‌ణ ప్ర‌ప‌సూతికి అవ‌కాశం ఏర్ప‌డి, అన‌వ‌స‌ర ఆప‌రేష‌న్లు
త‌గ్గుతున్నాయ‌న్నారు. అంతేగాక‌, క‌డుపులో ఉన్న‌ప్ప‌టి నుండే త‌ల్లీ, బిడ్డ‌ల ఆరోగ్య ప‌రిర‌క్ష‌ణ బాధ్య‌త
ప్ర‌భుత్వ‌మే తీసుకుంటున్న‌ద‌న్నారు. బిడ్డ పుట్టాక 9 నెల‌ల వ‌ర‌కు టీకాలు ఇవ్వ‌డం వ‌ల్ల ఆరోగ్య‌వంత‌మైన
పౌరుల త‌యారీని ప్ర‌భుత్వం చేప‌ట్టింద‌న్నారు. కెసిఆర్ కిట్ల ప‌థ‌కం అమ‌లులో పూర్తి ఉచితంగా వైద్య
స‌హాయమే కాకుండా, అద‌నంగా అందిస్తున్న నాలుగు విడ‌త‌ల ఆర్థిక స‌హాయం ఆ త‌ల్లీ బిడ్డ‌ల ఆత్మ‌గౌర‌వాన్ని
పెంచుతున్న‌ద‌న్నారు. రెక్కాడితే కానీ, డొక్కాడ‌ని నిరుపేద మ‌హిళ‌ల‌కు తెలంగాణ ప్ర‌భుత్వం అందిస్తున్న ఆర్థిక
స‌హాయం ఆరోగ్య ప‌రిర‌క్ష‌ణ‌కు, ఆత్మ‌గౌర‌వవానికి వెన్నుద‌న్నుగా ఉంటుంద‌న్నారు మంత్రి.  
రాష్ట్రంలో మొత్తం గ‌ర్బిణీలు 5,98,926 ఉండ‌గా, కెసిఆర్ కిట్ల ప‌థ‌కం ప్రారంభ‌మైన జూన్ 3వ తేదీ 2017 త‌ర్వాత
3,12,327 మంది గ‌ర్భీణీలు త‌మ పేర్ల‌ను కెసిఆర్ కిట్ల లో న‌మోదు చేసుకున్నార‌న్నారు. కెసిఆర్ కిట్ల ప‌థ‌కం

ప్రారంభ‌మ‌య్యాక ఇప్ప‌టి వ‌ర‌కు 4,04,714 మంది గ‌ర్బిణీల‌కు ఎఎన్‌సి  ప‌రీక్ష‌లు నిర్వ‌హిస్తున్నామ‌ని మంత్రి
చెప్పారు. ఇందులో ఇడిడి (ఎక్స్‌పెక్టెడ్ డెలీవ‌రీ డేట్లు) వ‌చ్చిన గ‌ర్బిణీలు 44,986 మంది ఉన్నార‌న్నారు. వీరిలో
8,270 మంది గ‌ర్బిణీలు హై రిస్క్ ప్ర‌సూతితో ఉన్నార‌ని డాక్ట‌ర్లు నిర్ధారించిన‌ట్లు మంత్రి చెప్పారు. ఇలాంటి వాళ్ళ‌కి
స‌మీప మెరుగైన‌, వాళ్ళ స‌మ‌స్య‌ల‌ను అదిగ‌మించ గ‌లిగిన పేట్ల బురుజు, నీలోఫ‌ర్‌, కోఠీ, హ‌న్మ‌కొండ‌, వ‌రంగ‌ల్‌,
ఆదిలాబాద్ వంటి వైద్య‌శాల‌ల‌ను రెఫ‌ర్ చేస్తున్న‌ట్లు మంత్రి తెలిపారు. కాగా, ఇప్ప‌టి వ‌ర‌కు 1,03,846 మంది
ప్ర‌భుత్వ ద‌వాఖానాల్లోనే ప్ర‌సూతి అయ్యార‌ని మంత్రి ల‌క్ష్మారెడ్డి వివ‌రించారు.
గ‌ణ‌నీయంగా త‌గ్గిన సీ సెక్ష‌న్లు
కెసిఆర్ కిట్ల ప‌థ‌కం ప్రారంభ‌మైన త‌ర్వాత మొత్తం ప్ర‌సూతిలు 1,04, 472 జ‌ర‌గ‌గా, సాధార‌ణ ప్ర‌సూతిలు 56,715
జ‌రిగాయని, సీ సెక్ష‌న్లు 47,752 జ‌రిగాయని మంత్రి తెలిపారు. శాతం లెక్క‌ల్లో 54శాతం నార్మ‌ల్ డెలీవ‌రీలు
జ‌ర‌గ‌గా, 46శాతం సీ సెక్ష‌న్లు జ‌రిగాయి. అంటే క్ర‌మేణా, సీ సెక్ష‌న్ల సంఖ్య త‌గ్గుతున్న‌ద‌ని మంత్రి వివ‌రించారు.
ఇందులో హై రిస్క్ కేసుల‌ను తీసేస్తే సీ సెక్ష‌న్లు 40శాతానికి త‌గ్గుతాయ‌ని మంత్రి చెప్పారు. 
ఇక పిల్ల‌ల విష‌యంలో కెసిఆర్ కిట్ల ప‌థ‌కం అమ‌లు ప్రారంభ‌మైన త‌ర్వాత నుంచి నేటి వ‌ర‌కు కిట్ల ప‌థ‌కం కింద‌
2,25,703 మంది పిల్ల‌లు పుట్టిన‌ట్లుగా న‌మోదైంద‌న్నారు. 59,782 పిల్ల‌ల‌కు టీకాలు ఇచ్చామ‌ని, 9 నెల‌ల
త‌ర్వాత ఇచ్చే టీకాలు 34,232 మంది పిల్ల‌ల‌కు ఇచ్చామ‌ని, ఇక 1,00,436 మందికి కెసిఆర్ కిట్లను పంపిణీ
చేశామ‌ని మంత్రి ల‌క్ష్మారెడ్డి వివ‌రించారు. 
ఇప్ప‌టి వ‌ర‌కు కెసిఆర్ కిట్ల ప‌థ‌కంలో రూ.93.63 కోట్లు వ్య‌య‌మ‌య్యాయ‌ని, ఇందులో ల‌బ్ధిదారుల‌కు
రూ.రూ.70.95 కోట్లు ల‌బ్ధిదారులైన గ‌ర్బిణీల ఖాతాల‌కు చేరాయ‌న్నారు. ఇక రూ.1.19 కోట్ల రూపాయ‌లు త‌ల్లీ
బిడ్డ‌ల‌కు సీఎం కానుక‌గా ఇస్తున్న కెసిఆర్ కిట్ల కోసం వెచ్చించామ‌న్నారు. 
అనుకున్న ల‌క్ష్యం దిశ‌గా న‌డుస్తున్న కెసిఆర్ కిట్ల ప‌థ‌కాన్ని ఆద‌రిస్తున్న అంద‌రికీ మంత్రి ల‌క్ష్మారెడ్డి
ధ‌న్య‌వాదాలు తెలిపారు. ఈ ప‌థ‌కం ఇప్ప‌టికే  దేశం దృష్టిని ఆక‌ర్శించింద‌ని, ప‌లు రాష్ట్రాల ప్ర‌తినిధులు
స్వ‌యంగా వ‌చ్చి ఈ ప‌థ‌కాన్ని ప‌రిశీలించి, త‌మ రాష్ట్రంలో అమ‌లు చేయ‌డానికి ప్ర‌య‌త్నిస్తున్నార‌ని మంత్రి
ల‌క్ష్మారెడ్డి తెలిపారు. బంగారు తెలంగాణ‌లో ఆరోగ్య తెలంగాణ సాధ‌న‌కు ఈ ప‌థ‌కం ఊతంగా ఉంటుంద‌ని మంత్రి
చెప్పారు. అలాగే సీఎం కెసిఆర్ నేతృత్వంలో చేపట్టిన మిష‌న్ భ‌గీర‌థ‌, మిష‌న్ కాక‌తీయ‌, హ‌రిత హారం వంటి
ప‌లు ప‌థ‌కాలు సైతం ఆరోగ్య తెలంగాణ సాధ‌న‌కే ఉప‌యోగ‌ప‌డుతున్నాయ‌ని మంత్రి వివ‌రించారు. తెలంగాణ
వ‌స్తే ఏమొస్త‌ది? అనే వాళ్ళ‌కు ఇంత‌కంటే సాక్షాత్కారం మ‌రోటి ఉండ‌ద‌న్నారు.

tags : lakshmareddy, kcr kits

Latest News
*వైసిపి నేత భద్రతను తీసేసిన ప్రభ/త్వం
*నంది అవార్డులు -బాలకృష్ణ రియాక్షన్
*బ్రాహ్మని, ఉపాసన ల కలయిక
*రాక్షసులు అడ్డుపడుతున్నారు-చంద్రబాబు
*సిబిఐ మాజీ జెడి లక్ష్మీనారాయణ ఇంటిలో చోరి
*బోటు ప్రమాదం-మంత్రి ఉమా పై ఆరోపణ
*నా కుమారుడు సబ్ కాంట్రాక్టు చేస్తే తప్పేంటి-మంత్రి
*మంత్రి నారాయణ మాట నమ్మశక్యమేనా?
*నంది అవార్డులు రఘువీరా స్పందన
*పోలవరం-కెవిపి పిల్ టిడిపికి ఉపయోగమేనా
*సెక్యులర్ పార్టీలతో కలుస్తాం-మాయావతి
*సింగపూర్ ను అందుకునే యత్నం-చంద్రబాబు
*టిడిపి కోవర్టులకే అవార్డులు ఇచ్చారు-మరో నటుడు
*ఆ భూకంపం నష్టం మూడు లక్షల కోట్లు
*పోలవరం లో కొన్నిపనులకు కొత్త టెండర్లు
*బాలకృష్ణకు ఘాటు రిప్లై ఇచ్చిన వైసిపి ఎమ్మెల్యే
*సామాజిక న్యాయానికి పెద్దపీట-పవన్ కళ్యాణ్
*చీటింగ్ కేసు పెట్టిన ప్రముఖ నటుడి సోదరి
*ఎసిపబిపై కి కుక్కలను వదలిన అదికారి
*పురందేశ్వరి,కన్నా డూప్లికేట్ బిజెపి నాయకులు-మంత్రి
*సింగపూర్ ఒప్పందం- కొన్ని ఇబ్బందులు-మంత్రి
*టిడిపి పవర్ లోకి వస్తే అగ్రవర్ణాలకు మూడే పదవులు
*గ్రీన్ ట్రిబ్యునల్ తీర్పుపై పిటిషనర్ వ్యాఖ్య
*ఎమ్మెల్యేల‌కు మంత్రి ఇంద్ర‌క‌ర‌ణ్ రెడ్డి లేఖ 
*రేవంత్ సేఫ్ గేమ్ ఆడుతున్నారట
*జయలలిత ఇంటిలో ఐటి సోదాలు
*ఏభై రోజులు సభ జరుపుతామన్నారుగా
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info