A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
పవన్ కళ్యాణ్ వెనక పోలీసు బాస్
Share |
November 18 2017, 11:13 pm

పవన్ కళ్యాణ్ వెనక పోలీసు బాస్!అంటూ తెలుగు గేట్ వేలో వాసిరెడ్డి శ్రీనివాస్ ఇచ్చిన ఈ కదనం ఆసక్తికరంగా ఉంది.

‘ఆయన కాంగ్రెస్ హయాంలో ఓ వెలుగు వెలిగారు. అవినీతి అంతు చూసే అధికారిగా ‘కలరింగ్’ ఇచ్చుకున్నారు. అంతిమంగా ఆయన అప్పటి అధికార పార్టీ చేతిలో కీలుబొమ్మగా పనిచేశారే తప్ప..‘అవినీతి’ ఆయన ఎజెండా కానేకాదని తేలిపోయింది. కానీ మీడియా సహకారంతో ఆయన ఇమేజ్ అలా పెరిగిపోయింది. తర్వాత పెద్దగా పట్టించుకునే వారే లేకుండా పోయారు. కేంద్రంలో బిజెపి ప్రభుత్వం వచ్చాక ఆయనకు పెద్దగా ప్రాధాన్యత లేని పోస్ట్ మాత్రం ఇచ్చారు. ఆయనే ప్రస్తుతం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అనధికార రాజకీయ సలహాదారుగా వ్యవహరిస్తున్నట్లు ప్రభుత్వ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. ఆయన సలహాల ప్రకారమే పవన్ కదలికలు ఉంటున్నాయని సమాచారం. ఈ వ్యవహారంపై కేంద్రం వద్ద ఓ నివేదిక కూడా ఉందని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. కేంద్రంలో అధికారంలో ఉన్న బిజెపి ఆయనపై ఓ కన్నేసి ఉంచింది.

పవన్ కళ్యాణ్ కొంత కాలం క్రితం బిజెపిపై ఘాటు విమర్శల చేయటం వెనక కూడా ఆయన పాత్ర ఉందని ఢిల్లీ వర్గాలు భావిస్తున్నాయి. ఇదిలా ఉంటే ఈ పోలీస్ బాస్ ఆంధప్రదేశ్ లో తరచూ కాలేజీ విద్యార్ధులతో సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఈ సమావేశాలకు ఏపీలో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడికి అత్యంత సన్నిహితుడిగా ఉన్న మంత్రి ఒకరు ఈ సమావేశాల వ్యవహారం చూసుకుంటున్నారని చెబుతున్నారు. పవన్ కళ్యాణ్ కూడా వచ్చే ఎన్నికల్లో ఏపీలోని 175 సీట్లలో బరిలోకి దిగకుండా టీడీపీ పొత్తుతో కేవలం 30 నుంచి 40 సీట్లలోనే బరిలో నిలవాలనే యోచనలో ఉన్నారు. ఇదంతా చూస్తుంటే చాలా ముందస్తు ప్లాన్ ప్రకారమే అంతా ‘వ్యవస్థీకృత రాజకీయం’ జరుగుతున్నట్లు కన్పిస్తోందని ఓ సీనియర్ పోలీస్ అధికారి వ్యాఖ్యానించారు.

tags : pawankalyan, police boss

Latest News
*వైసిపి నేత భద్రతను తీసేసిన ప్రభ/త్వం
*నంది అవార్డులు -బాలకృష్ణ రియాక్షన్
*బ్రాహ్మని, ఉపాసన ల కలయిక
*రాక్షసులు అడ్డుపడుతున్నారు-చంద్రబాబు
*సిబిఐ మాజీ జెడి లక్ష్మీనారాయణ ఇంటిలో చోరి
*బోటు ప్రమాదం-మంత్రి ఉమా పై ఆరోపణ
*నా కుమారుడు సబ్ కాంట్రాక్టు చేస్తే తప్పేంటి-మంత్రి
*మంత్రి నారాయణ మాట నమ్మశక్యమేనా?
*నంది అవార్డులు రఘువీరా స్పందన
*పోలవరం-కెవిపి పిల్ టిడిపికి ఉపయోగమేనా
*సెక్యులర్ పార్టీలతో కలుస్తాం-మాయావతి
*సింగపూర్ ను అందుకునే యత్నం-చంద్రబాబు
*టిడిపి కోవర్టులకే అవార్డులు ఇచ్చారు-మరో నటుడు
*ఆ భూకంపం నష్టం మూడు లక్షల కోట్లు
*పోలవరం లో కొన్నిపనులకు కొత్త టెండర్లు
*బాలకృష్ణకు ఘాటు రిప్లై ఇచ్చిన వైసిపి ఎమ్మెల్యే
*సామాజిక న్యాయానికి పెద్దపీట-పవన్ కళ్యాణ్
*చీటింగ్ కేసు పెట్టిన ప్రముఖ నటుడి సోదరి
*ఎసిపబిపై కి కుక్కలను వదలిన అదికారి
*పురందేశ్వరి,కన్నా డూప్లికేట్ బిజెపి నాయకులు-మంత్రి
*సింగపూర్ ఒప్పందం- కొన్ని ఇబ్బందులు-మంత్రి
*టిడిపి పవర్ లోకి వస్తే అగ్రవర్ణాలకు మూడే పదవులు
*గ్రీన్ ట్రిబ్యునల్ తీర్పుపై పిటిషనర్ వ్యాఖ్య
*ఎమ్మెల్యేల‌కు మంత్రి ఇంద్ర‌క‌ర‌ణ్ రెడ్డి లేఖ 
*రేవంత్ సేఫ్ గేమ్ ఆడుతున్నారట
*జయలలిత ఇంటిలో ఐటి సోదాలు
*ఏభై రోజులు సభ జరుపుతామన్నారుగా
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info