A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
ఆంధ్రజ్యోతి ఎమ.డి.కోర్టుకు గైర్ హాజర..కారణం ఇదా
Share |
June 23 2018, 9:09 pm

పరువు నష్టం కేసులో ఆంద్రజ్యతి ఎమ్.డి. రాధాకృష్ణ , ఆ సంస్థ కు చెందిన మరో నలుగురు కోర్టుకు హాజరుకాకపోవడానికి చూపిన కారణం ఆశ్చర్యంగానే ఉంది. కోర్టు కూడా అదే ప్రకారం విస్మయం వ్యక్తం చేసిందని వార్త వచ్చింది.ఎదుటివారిపై పలు రకాలుగా వార్తలు రాసే మీడియా వారు తాము కోర్టుకు రాకపోవడానికి కారణం ఏమి చెప్పారంటే అసెంబ్లీ సమావేశాలు జరుగున్నాయని.మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి ఈ పరువు నష్టం కేసు దాఖలు చేశారు.ఏపీ ప్రత్యేక హోదా, కరువు అంశాలపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీని కలిసిన సమయంలో ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిపై తప్పుడు కథనం ప్రచురించి, ఆయన పరువు ప్రతిష్టలను దెబ్బతీశారని,నాంపల్లి కోర్టు దీనిని విచారణకు స్వీకరించింది. ఈ కేసు విచారణకు హాజరు కావల్సిన రాధాకృష్ణ, ఎడిటర్‌ కె.శ్రీనివాస్, పబ్లిషర్‌ శేషగిరిరావు, మరో నలుగురు ఉద్యోగులు గైర్ హాజరయ్యారు.దీనిపై కోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది. మంగళవారం నాటి విచారణకు వారు హాజరు కాకుండా తమ న్యాయవాది ద్వారా పిటిషన్‌ దాఖలు చేయించారు. అసెంబ్లీ సమావేశాల కారణంగా తాము కోర్టు ముందు హాజరు కాలేపోతున్నామని అందులో పేర్కొన్నారు. అసెంబ్లీ సమావేశాలకు, వీరికి ఏం సంబంధం ఉందంటూ ఆశ్చర్యపోయింది. ఈ సమయంలో రామకృష్ణారెడ్డి తరఫు న్యాయవాది పొన్నవోలు సుధాకర్‌రెడ్డి స్పందిస్తూ... ఫిర్యాదుదారు ఎమ్మెల్యే అని, ఆయనే న్యాయస్థానం ముందు హాజరు కాగా, అసెంబ్లీతో సంబంధం లేని వ్యక్తులు మాత్రం గైర్హాజరయ్యారని వివరించారు. ఈ వాదనలను పరిగణనలోకి తీసుకున్న కోర్టు, తదుపరి విచారణకు వ్యక్తితంగా హాజరై తీరాలని రాధాకృష్ణ, శ్రీనివాస్, శేషగిరిరావు తదితరులకు ఆదేశాలు ఇచ్చింది.

tags : andhrajyothi, md, court, absent

Latest News
*టిజి వెంకటేష్ ను మెంటల్ ఆస్పత్రిలో చేర్చాలి
*ఎపిలో అవినీతి -నిరూపించలేకపోతే జైలుకెళ్తా
*కాంగ్రెస్ లో బిసిలకు ప్రాదాన్యత తగ్గింది
*కెఎస్ ఆర్ లైవ్ షో రికార్డు
*వైసిపి ఎమ్.పిల రాజీనామా- అసలు సమస్య బిజెపికి
*ప్రముఖ దర్శకుడిపై కేసు
*మోత్కుపల్లిని బూతులు తిట్టిన టిజి వెంకటేష్
*దీక్ష తో రమేష్ కు ఐదు కోట్ల ఖర్చట
*హోదా అంటే జైలులో పెడతామన్నారే
*ఎపికి 1.75 లక్షల కోట్లు ఇచ్చాం-బిజెపి
*ఎపిలో పంచాయతీ ఎన్నికలు ఇప్పుడు లేనట్లేనా
*మోడీపై పోరు-చంద్రబాబుకు దైర్యం ఉందట
*అయ్యన్నది అడ్డగోలు సవాలా?
*దానం ఇంటికి ఉత్తం వెళ్లడం ఏమిటి
*ఇబ్రహింపట్నం సంగమం వద్ద 4 గురు గల్లంతు
*నాదెండ్ల మనోహర్ జనసేన వైపు వెళతారా
*సి.ఎమ్.రమేష్ కొత్త పెళ్లికొడుకులా ఉన్నారే..
*కెసిఆర్ లైవ్ షో రికార్డు
*కెసిఆర్ కు బివి రాఘవులు సలహా
*లోకేష్ నిజాలే చెప్పారా
*టిటిడిపిలో బిజెపి మహాకుట్ర అన్న మంత్రి
*బిజెపి,టిడిపి లాలూచీ- రాజీనామాల ఆమోదం లేటు
*చంద్రబాబు ఓ తీతువు పిట్ట మాదిరి
*దానం కు సికింద్రాబాద్ లోక్ సభ సీటు ఇస్తారా
*న్యాయవ్యవస్థ ప్రమాదంలో పడుతుంటుంది
*సి.ఎమ్. ఎంతో అబిమానం చూపుతున్నారు-గంటా
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info