A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
కాలిఫోర్నియాలో కాల్పులు- నలుగురి మృతి
Share |
January 19 2018, 5:03 am

అమెరికాకు కాల్పుల పీడ పోవడం లేదు. మళ్లీ ఉత్తర కాలిఫోర్నియాలో ఒక స్కూల్ పై ఒక ముష్కరుడు తెగబడి కాల్పులు జరిపాడు. ఆ దుర్మార్గుడి ఘాతుకానికి నలుగురు బలైపోగా, మరికొందరు గాయపడ్డారు. ఇది ఉగ్రవాద చర్యా?లేక ఉన్మాది చర్యా అన్నది తెలియవలసి ఉంది. ఆ తర్వాత భద్రతా దళాలు ఆ దుండగుడిని కాల్చి చంపారు. ఉత్తర కాలిఫోర్నియాలోని థెహామా కౌంటీలో ఈఘోరం జరిగింది. ట్రక్‌పై వచ్చిన దుండగుడు రాంచో థెహామా ఎలిమెంటరీ స్కూల్ గేట్‌ను ఢీకొట్టి స్కూల్‌పైకి కాల్పులు జరిపాడు. బుల్లెట్ల శబ్ధాలతో స్కూల్ ఆవరణ మారుమోగిపోయింది. భయాందోళనలతో విద్యార్థులు, టీచర్లు తరగతి గదుల్లోని డెస్కులు, బెంచ్‌ల కింద పడుకున్నారు. పది మంది వరకు గాయపడ్డారు.

tags : america, firing

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info