A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
ఆత్మాభిమానం ఉన్న ఆంద్రులు ఎవరైనా సమర్దిస్తారా
Share |
June 19 2018, 12:29 pm

విభజన తర్వాత కాని, అంతకుముందు ఉమ్మడి ఆంద్రప్రదేశ్ రాష్ట్రంలో కాని జరగని సన్నివేశం ఇప్పుడు ఎపి శాసనసభలో ఆవిష్కృతం అయింది.ప్రతిపక్షం లేకుండానే అసెంబ్లీని నడిపించుకోవలసిన దుర్గతి అదికార తెలుగుదేశం పార్టీకి పట్టింది.ఇది వారికి ఎంతో అప్రతిష్ట తెచ్చే విషయమే. ఎందుకు విపక్ష వైఎస్ ఆర్ కాంగ్రెస్ అసెంబ్లీని బహిష్కరించిందో అందరికి తెలుసు. దిక్కుమాలిన అనైతిక ఫిరాయింపు రాజకీయాలను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విలువలను వదలివేసి ప్రోత్సహిస్తుంటే,దానికి స్పీకర్ కోడెల శిశప్రసాదరావు వ్యక్తిత్వం వదలుకుని అండగా ఉంటున్నందుకు నిరసనగా వైసిసి ఈ నిర్ణయం తీసుకుంది. అదికార తెలుగుదేశం పార్టీ దీనిని ఊహించలేకపోయింది.దేశ వ్యాప్తంగా తెలుగుదేశం పార్టీకి ఇప్పుడు పరువు పోయే పరిస్థితి ఏర్పడింది. అనైతికంగా పిరాయింపులను అనుమతించబోనని ఆనాడు ఎన్.టి.రామారావు తెలుగుదేశం పార్టీని స్థాపించారు. తన పార్టీలో చేరదలచినవారు ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయవలసిందేనని ఆయన షరతు పెట్టారు.అలాంటి దశ నుంచి ఎమ్మెల్యేలను విచ్చలవిడిగా, చంద్రబాబే ఒక్కప్పుడు చెప్పినట్లు సంతలో పశువులను కొన్నట్లుగా అన్న దశకు తెలుగుదేశం పార్టీ దిగజారిపోవడం పార్టీ ఆవిర్భావం నుంచి అభిమానించేవారికి ఆవేదన కలిగిస్తుంది. చంద్రబాబు ఎటూ మొదటి నుంచి తెలుగుదేశంలో లేరు.ఆయన మామ ఎన్.టి.ఆర్.పైనే పోటీచేస్తానని తొడకొట్టి ఓడిపోయి, తదుపరి టిదిపిలో ప్రవేశించి ఆ పార్టీనే కబ్జా చేయగలిగారు.కాని యనమల రామకృష్ణుడు, కోడెల శివప్రసాదరావు వంటి వారు తెలుగుదేశంతోనే రాజకీయాలలోకి వచ్చారు. ఆ పార్టీలోనే పెరిగారు.వారు కూడా ఈ దిగజారుడు రాజకీయాలకు అలవాటుపడిపోవడం దురదృష్టకరం.పైగా కోడెల సమర్ధించుకుంటున్న తీరు మరింత శోచనీయంగా ఉంది. పిరాయింపులపై వైఎస్ ఆర్ కాంగ్రెస్ కోర్టుకు వెళ్లిందని, ఇప్పుడు తనపై నెపం వేస్తారా అని ఆయన అంటున్నారు.దానికి ముఖ్యమంత్రి చంద్రబాబు వంత పాడుతున్నారు. ఎప్పుడు వైసిపి కోర్టుకు వెళ్లింది.కోడెల నిష్క్రియా ప్రియంగా ఉంటే కాదా కోర్టుకు వెళ్లింది. ఎందువల్ల కోడెల కనీసం విచారణ కూడా జరపలేదు? దానికి ఆయన వద్ద సమాధానం ఉందా? ముఖ్యమంత్రి చంద్రబాబు స్వయంగా విపక్ష ఎమ్మెల్యేలకు పచ్చ కండువా కప్పడాన్ని కోడెల చూడలేదా?అంతేకాదు. వారికి ఆయన ఎక్కడ సీట్లు కేటాయించారు? కాని మరి ఎమ్మెల్యేల జాబితాలో వైసిపి ఎమ్మెల్యేలుగానే ఎందుకు పరిగణిస్తున్నారు. అలాంటప్పుడు వారిలో నలుగురు మంత్రులు ఎలా అయ్యారు.వీటన్నిటికి చంద్రబాబుకాని, కోడెల కాని సమాధానాలు చెప్పలేరు.ఎందుకంటే వారికి కూడా తెలుసు తాము తప్పు చేస్తున్నామని,నీతిమాలిన పని చేస్తున్నామని, ఇది రాజ్యాంగ వ్యవస్థలను చెరబట్టడమే అవుతుంది. కనుక ఏదో ఒకటి బొంకి తమ పబ్బం గడుపుకోవాలని అదికార తెలుగుదేశం కాని, స్పీకర్ వ్యవస్థ కాని చూస్తే అది అయ్యే పనికాదు. ఆంద్ర సమాజాన్ని ఫిరాయింపుల సమాజంగా మార్చాలనుకుంటున్నట్లుగా ఉంది.ఆత్మ గౌరవం కలిగిన ఆంద్రుడు ఎవరైనా దీనిని సహిస్తారా?

tags : ap,assembly, self respect

Latest News
*మాజీ సి.ఎమ్.పై భూ ఆక్రమణ కేసు
*అసలు చంద్రబాబుకు ఏమైంది-టిడిపి మల్లగుల్లాలు
*కాల్పులలో యువగాయకుడు బలి
*ఆ పత్రిక సర్వే అంతా ఆత్మహత్యా సదృశమే--సువేరా
*ట్విటర్ నాయుడుగా లోకేష్ మారారు
*తెలుగుదేశం పులా..పులి వేషమా
*jకిరణ్ కుమార్ రెడ్డి కాంగ్రెస్ లోకి వస్తే
*రాజ్యసభ డిప్యూటి చైర్మన్ రేసులో కెకె
*రేషన్ షాపులకు చంద్రబాబు వింత ఆదేశం
*అత్యాచారాలపై పవన్ స్పందన
*ప్రముఖ మిమిక్రీ కళాకారుడు నేరేళ్ల కన్నుమూత
*ఆంద్రజ్యోతి సర్వే నీతిమాలిన సర్వే-రోజా
*ఈఫెల్ టవర్ కు బుల్లెట్ ప్రూప్ అద్దాలు
*జగన్ నడిచే రో్డ్డు, తాగే నీరు..అన్నీ మావే-టిడిపి
*చంద్రబాబు డిల్లీలో పిల్లి అయిపోయారే
*ఒక ఇసుక ర్యాంప్ కు లోకేష్ పేరు పెట్టారట
*చంద్రబాబుపై కేసు పెడతాం- బిజెపి నేత
*ఆ రిటైర్డ్ పోలీస్ ఆఫీసర్లు ఉద్యమంలో దిగుతారా
*నాయీ బ్రాహ్మణులనే ఈనాడు కూడా తప్పు పట్టిందా
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info