A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
ప్రతి మున్సిపాలిటీకి 10 కోట్లు.
Share |
December 10 2018, 11:22 pm

పురపాలక సంఘాల సర్వతోముఖాభివృద్ధికి గాను ప్రతి మున్సిపాలిటీకి 10
కోట్ల రూపాయలు విడుదల చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. మున్సిపల్
మంత్రి కేటి ఆర్ ఈ నిర్ణయాన్ని ప్రకటించారు. పలు పురపాలక సంఘాలలో
సిబ్బంది కొరత సమస్య ఉన్నందున రిక్రూట్ మెంటు ప్రక్రియ
జరుగుతున్నట్టు కే టి ఆర్ చెప్పారు. 30 జిల్లా కేంద్రాలు, అర్బన్
డెవలప్ మెంటు అధారిటీ లకు వెంటనే పట్టణ మాస్టర్ ప్లాన్
రూపొందించి పంపాలని పురపాలక మంత్రి ఆదేశించారు.సిద్ధి పేట పట్టణం
మరో 13 గ్రామాలు కలుపుకొని “ సుడా’ గా మారుతున్నందున ఎలాంటి జాప్యం
లేకుండా సిద్ధిపేట మాస్టర్ ప్లాన్ ఆమోదం కోసం పంపించాలని కోరారు.
ఏడాది తర్వాత జరగనున్న ఎన్నికల నేపథ్యంలో మున్సిపాలిటీల రూపు రేఖలు
సంపూర్ణంగా మార్చాలని ఎం.ఎల్.ఏ.లు, ఎం.ఎల్.సి.లు, మున్సిపల్ చైర్మన్లు,
కమిషనర్లను మంత్రులు కే టిఆర్, హరీశ్ రావు ఆదేశించారు.ప్రతి
మున్సిపాల్టీ సిద్ధిపేట లాగా ఆదర్శ మున్సిపాలిటీగా మారాలని కేటిఆర్
అన్నారు. ఉమ్మడి మెదక్ జిల్లా ప్రజా ప్రతినిధులు, మునిసిపల్
అధికారులతో సోమవారం ఇక్కడ సచివాలయం లో ఇద్దరు మంత్రులు సమీక్ష
సమావేశం నిర్వహించారు. పురపాలక సంఘాల్లో చేపట్టవ వలసిన
కార్యక్రమాలపై ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు మంత్రులు ఈ సమీక్ష
నిర్వహించారు. త్వరలో ఉమ్మడి మెదక్ జిల్లాను బహిరంగ మలవిసర్జన రహిత
జిల్లా గా ప్రకటించేందుకు చర్యలు చేపట్టాలని మంత్రి కే టి ఆర్
కోరారు. ఆందోల్ వంటి అసెంబ్లీ నియోజక వర్గంలో పెండింగులో ఉన్న ఓ డి
ఎఫ్ పనులను యుద్ధ ప్రాతిపదికన పూర్తీ చేయాలని ఆయన ఆదేశించారు.
ముఖ్యంగా ప్రతి పట్టణాన్ని స్వచ్ఛ పట్టణంగా తయారుచేసేందుకు
పారిశుద్ధ్యానికి అత్యంత అధిక ప్రాధాన్యత ఇవ్వాలని
కోరారు.ఇందుకోసం అవసరమైన రవాణా వాహనాలను అందించేందుకు సిద్ధంగా
ఉన్నామన్నారు. ప్రతి పట్టణంలోనూ మొదటి దశలో ప్రయోగాత్మకంగా
తడి, పొడి చెత్త కార్యక్రమాన్ని ఎంచుకున్న వార్డుల్లో
ప్రారంభించాలన్నారు. గజ్వేల్ ,సిద్ధిపేట మునిసిపాలిటీల్లో చేపడుతున్న
పారిశుద్ధ్య కార్యక్రమాలతో సహా ఇతర అన్ని కార్యక్రమాలను కేటీ

రామారావు అభినందించారు. సిద్ధిపేటలో అమలు చేస్తున్న కార్యక్రమాలను
అధ్యయనం చేసి వాటిని యథాతథంగా అమలు చేయాలన్నారు. కోమటి చెరువు,
వై కుంట ధామం వంటి కార్యక్రమాలను కే టి ఆర్ ప్రశంసించారు.
ప్రభుత్వం అందించే ఈ 10 కోట్ల ప్రత్యేక నిధులతో ప్రజలకు అవసరమైన
పార్కులు, మోడల్ మార్కెట్లు, స్మశానాల అభివృద్ధి, పబ్లిక్
టాయిలెట్ ల నిర్మాణం, వంటి కార్యక్రమాలకు ప్రాధాన్యత ఇవ్వాల
న్నారు. ఈ సందర్భంగా మున్సిపాలిటీలు, నగర పంచాయతీల వారీగా మంత్రులు
సమీక్ష జరిపారు. 15 వేలు పై బడిన జనాభా ఉన్న గ్రామ పంచాయతీలన్నింటినీ
నగర పంచాయతీలుగా మార్చాలని ముఖ్యమంత్రి కేసి ఆర్ ఇదివరకే నిర్ణయం
తీసుకున్న విషయాన్ని మంత్రి కే టి ఆర్ తెలిపారు.మెదక్ జిల్లా లో
నర్సాపూర్, రామాయం పేట, సంగారెడ్డి లో నారాయఖేడ్ గ్రామ
పంచాయతీలుగా మార్చాలని మంత్రి హరీశ్ రావు కోరారు.

tags : ktr,muncipality

Latest News
*పటేల్ రాజీనామ-చంద్రబాబు ఫైర్
*మోటార్ సైకిల్ పై ఎందుకు వచ్చానంటే..అసద్
*రిజర్వు బ్యాంక్ గవర్నర్ రాజీనామా
*కేంద్ర మంత్రి పదవికి రాజీనామా
*ఈవిఎమ్ ల హాకింగ్- కాంగ్రెస్ నేత శ్రావణ్ డౌటు
*అమరావతిలో ప్రభుత్వ రియల్ ఎస్టేట్ బిజినెస్
*తెలంగాణకే కాదు..ఆంద్ర ప్రజలకు పరీక్షే- విశ్లేషణ
*ఉండవల్లికి కళ్లు తిరుగుతున్నాయి
*ఎపిలో ఎన్నికల ముందు మరో కొత్త స్కీమ్
*పార్టీ మారను-అదంతా కేంద్రం కుట్ర అట
*చంద్రబాబు-కట్టప్ప-బిజెపి
*క్షమాపణ కోరిన మాజీ ముఖ్యమంత్రి కుటుంబం
*తెలంగాణలో గబ్బిలాలను వాడిన నేతలు
*ఒడిషా లో కాంగ్రెస్ కోసం టిడిపి ప్లాన్ బి
*పోన్ చేసింది నిజమే కాని..కొండా వివరణ
*ప్రజా కూటమి ముందస్తు జాగ్రత్త
*రిజర్వు బ్యాంక్ గవర్నర్ రాజీనామా
*టిఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్ధికి కొండా ఫోన్
*టిఆర్ఎస్ కే మా మద్దతు- మజ్లిస్
*తెలంగాణలో కాంగ్రెస్ సి.ఎమ్. అభ్యర్దుల వెనుకంజ
*హంగ్ వస్తే ముందు మమ్మల్నే పిలవాలి-కూటమి
*తెలంగాణలో ఎవరు ఎటువైపు-ఇండియా టుడే
*అమరావతి అవినీతిమయం- మాజీ జస్టిస్
*అమరావతి-అంతర్జాతీయం-చంద్రబాబు
*ముస్లిం ప్రాంతాలంటేనే పోలీసులకు వివక్ష
*ఓట్ల లెక్కింపుపై కాంగ్రెస్ కొత్త డిమాండ్
*బిజెపికి టిఆర్ఎస్ బి టీమే..
*మహారాష్ట్ర కు షిర్డి ట్రస్టు 500 కోట్ల రుణం
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info