A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
అమెరికాలో భారత విద్యార్దుల సంఖ్య పెరిగింది
Share |
January 19 2018, 5:12 am

అమెరికా వెళ్లే వారిపై అనేక ఆంక్షలు పెడుతున్నా, భారత్ నుంచి అక్కడకు వెళ్లి చదువుకునే వారి సంఖ్య గణనీయంగా పెరిగిందట. తాజాగా వచ్చిన ఒక నివేదిక ఆ విషయం వెల్లడించింది. అమెరికా వెళ్లి చదువుకునే వారిలో చైనా అగ్ర స్థానంలో ఉండగా, ఆ తర్వాత భారత్ ఉంటుంది.2016-17 విద్యా సంవత్సరంలో అమెరికాలో 186,267 మంది భారతీయ విద్యార్థులు ఉన్న ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఇంటర్నేషనల్‌ ఎడ్యుకేషన్‌ నివేదిక వెల్లడించింది. అమెరికాలో చదువుకుంటున్న విదేశీ విద్యార్థుల్లో 17.3 శాతం మన భారతీయ విద్యార్థులే .అమెరికాలో మన విద్యార్థుల సంఖ్య పెరుగుతుంటే భారత్‌లో అమెరికన్‌ విద్యార్థుల సంఖ్య తగ్గుతోందని కూడా ఆ నివేదిక తెలిపింది.. 2016తో పోలిస్తే.. ఈ ఏడాది సంఖ్య 4,438 నుంచి 4,181కి తగ్గిపోవడం గమనార్హం.చైనాలో 350,755 మంది భారతీయ విద్యార్థులు ఉన్నారు. ఈ ఏడాది అక్కడి భారతీయుల సంఖ్య 6.8 శాతం పెరిగింది. అమెరికాలో విదేశీ విద్యార్థుల సంఖ్య మూడు శాతం పెరిగితే.. విదేశాల్లో అమెరికన్‌ విద్యార్థుల సంఖ్య నాలుగు శాతానికి పెరిగింది.

tags : america, indians

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info