A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
అమరావతిలోనే సినీ పరిశ్రమ
Share |
January 19 2018, 5:00 am

సినీ పరిశ్రమ కూడా అమరావతిలో నే ఉండాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు భావిస్తున్నారు. సినీ ప్రముఖులతో ఆయన మాట్లాడినప్పుడు ఈ భావాలు వ్యక్తం చేశారు.విశాఖ పట్నం, అమరావతిలకు సినీ పరిశ్రమ ను తీసుకురావాలన్నదానిపై సమాలోచనలు జరుగుతున్నాయని ఆయన అన్నారు.విశాఖకు సినీ పరిశ్రమ తరలించాలని ఎక్కువ మంది చెబుతున్నా, వచ్చేకాలంలో అమరావతి ప్రపంచలోనే ఉత్తమ నగరం అవుతుంది కనుక సినీ పరిశ్రమ ఇక్కడ ఉంటేనే బాగుంటుందని ఆయన అబిప్రాయపడ్డారు.
తక్కువ బడ్జెట్‌ చిత్రాలకు పన్ను రాయితీ ఇవ్వాలన్న అంశాన్ని పరిశీలిస్తున్నామని, పరిశ్రమ శ్రేయస్సును దృష్టిలో ఉంచుకుని త్వరలో తగిన నిర్ణయం తీసుకుంటామన్నారు.
తెలుగు చలన చిత్ర పరిశ్రమ హైదరాబాద్‌లో నిలదొక్కుకునేందుకు అ‍క్కడ అన్ని మౌలిక సదుపాయాలు తానే కల్పించానని, మళ్లీ ఇప్పుడు పరిశ్రమను అభివృద్ధి చేసే బాధ్యత తీసుకున్నానన్నారు.

tags : chandrababu, amaravati

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info