A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
మంత్రులు ఆషామాషీ గా ఉంటున్నారు-గోరంట్ల
Share |
June 23 2018, 2:12 am

ఎపిలో మంత్రులు శాసనసభలో సమాధానాలు ఇస్తున్న తీరుపట్ల అదికార తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి అసంతృప్తి వ్యక్తం చేశారు.జీరో అవరలో సభ్యులు లేవనెత్తిన ప్రశ్నలకు తగు సమాదానాలు ఇవ్వడం లేదని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. జీరో అవర్ ను మంత్రులు ఆషామాషీగా తీసుకుంటున్నారని ఆయన పేర్కొన్నారు. జీరో అవర్ లో ప్రస్తావించే సమస్యలకు మంత్రులు జవాబులు ఇవ్వడం లేదని ఆయన ఆక్షేపణ వ్యక్తం చేశారు. గోరంట్ల చేసిన విమర్శలకు బిజెపి పక్ష నేత విష్ణుకుమార్ రాజు మద్దతు ఇచ్చారు. గతంలో జీరో అవర్ లో చెప్పిన విషయాలకు సమాదానాలే అందడం లేదని ఆయన అన్నారు. మంత్రి అచ్చెన్నాయుడు మాట్లాడుతూ జీరో అవర్ లో వస్తున్న సమస్యలపై ప్రభుత్వం పరిష్కారం చేసే కృషి చేస్తున్నామని అన్నారు.

tags : gorantla, minister

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info