A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
పోలవరం-టిడిపి,బిజెపిల మధ్య తగాదానా
Share |
September 25 2018, 2:24 am

పోలవరం ప్రాజెక్టుపై ఆందోళన కలిగించే విదంగా గందరగోళ పరిస్థితి ఏర్పడుతోంది. ఒకవైపు ఎపి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మొత్తం తానే ప్రాజెక్టును నిర్మిస్తున్నానని పోకస్ చేసుకోవడానికి జరిగిన ప్రయత్నం బెడిసినట్లయింది.ఈ ప్రాజెక్టు ఎపికి అత్యంత ప్రతిష్టాత్మకమైనది.దివంగత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి పుణ్యమా అని ఈ ప్రాజెక్టుకు కదలిక వచ్చింది. ఆయన హయంలో ఈ ప్రాజెక్టుపై ప్రత్యేకంగా అఖిలపక్ష సమావేశం కూడా నిర్వహించారు. అలాగే పలు ముంపు గ్రామాలలో నిర్వాసితులు అయ్యేవారికి పరిహారం ఇవ్వడం కూడా చేశారు.అదే సమయంలో కేంద్రం నుంచి ఈ ప్రాజెక్టుకు అవసరమైన అనుమతులు కేంద్రం నుంచి రాబట్టడానికి విశేష కృషి చేశారు.అలాగే ప్రాజెక్టులో భాగంగా అవసరమైన రెండు ముఖ్యమైన ప్రధాన కాల్వలను చాలావరకు పూర్తి చేశారు. కృష్ణానదిలోకి గోదావరి నీటిని కలిపే బృహత్తర యత్నానికి ఆయన టైమ్ లోనే శ్రీకారం చుట్టారు. ప్రాజెక్టు డామ్ ఆరంభం అయ్యే సమయానికి వైఎస్ అనూహ్యంగా మరణించడం పెద్ద శాపం అయింది. వైఎస్ కన్నా ముందుగా తొమ్మిదేళ్లపాటు ముఖ్యమంత్రి గా ఉన్న చంద్రబాబు పోలవరం ప్రాజెక్టు అయ్యేది కాదని అనుకునేవారు . ఆ విషయాన్ని ఆయన ఎన్నడూ దాచుకోలేదు.వైఎస్ అలాకాకుండా పోలవరం సాదించాల్సిందేనన్న పట్టుదలతో పనిచేసి సఫలం అయ్యారు.ఆయన మరణం తర్వాత రోశయ్య హయాంలో పెద్దగా ముందుకు సాగలేదు. తదుపరి కిరణ్ కుమార్ రెడ్డి టైమ్ లో కాంట్రాక్టర్ ఎంపిక జరిగింది.ఆ సమయంలో కాంట్రాక్టర్ ఎంపికను ఆనాటి ప్రతిపక్ష నేతగా చంద్రబాబు వివాదం చేసిన సంగతి ఆయనకు గుర్తు లేకపోవచ్చు.అలాగే కాల్వ నిర్మాణంలో తెలుగుదేశం కార్యకర్తలతో కోర్టులలో కేసుల వేయించినసంగతి కూడా ఇప్పుడు ప్రస్తావించకపోవచ్చు.అయినా ఫర్వాలేదు.అనూహ్యంగా విభజన తర్వాత ఎపికి ముఖ్యమంత్రి అయిన తర్వాత చంద్రబాబు నాయుడు పోలవరం పై కొంతకాలం అసలు శ్రద్ద పెట్టలేదు.పైగా పట్టిసీమ పేరుతో 1600కోట్లను ఖర్చుచేస్తే,అందులో 400 కోట్ల మేర దుర్వినియోగం అయిందని కాగ్ తప్పు పట్టే పరిస్తితి వచ్చింది.ఆ డబ్బుతో అప్పటికి ఉన్న పరిస్థితిలో ప్రధాన డ్యామ్ నిర్మాణానికి చొరవ తీసుకుని ఉంటే కేంద్రం కూడా ఆ డబ్బు ఇవ్వక తప్పని పరిస్థితి ఏర్పడేది.అసలు కేంద్రం నుంచి ప్రాజెక్టును తాను తీసుకోవలసిన అవసరం లేదు.కాని తీసుకున్నారు. కేంద్రం కూడా చంద్రబాబుపై నెపం నెట్టవచ్చనుకున్నదో ఏమో కాని ఆయన అడిగిన వెంటనే అప్పగించేసింది.మూడున్నర ఏళ్ల తర్వాత కేంద్రం,రాష్ట్రం మధ్య దీనిపై వివాదం ఏర్పడింది.కాపర్ డామ్ అంశంలో కాని, నిర్వాసితులకు పునరావాసం కాని, పీల్డ్ చానల్స్ కాని, వ్యయ అంచనాలు కాని ,కాంట్రాక్టర్ గా ఉన్న ట్రాన్స్ ట్రాయ్ కంపెనీని కాని తప్పించడంలో కాని ఇలా ఆయా అంశాలలో తగాదా వస్తే తెలుగుదేశం మీడియా ద్వారా కేంద్రంపై దాడి చేయించారు. కేంద్రమే పోలవరం ప్రాజెక్టుకు మోకాలు అడ్డుతోందని రాయించారు. అది నిజమే అయితే చాలా సీరియస్ అంశం.ముఖ్యమంత్రి చంద్రబాబు పోలవరం కడుతుంటే, ప్రధాని మోడీ అడ్డుకుంటున్నారని తెలుగుదేశం మీడియా ప్రచారం ఆరంభించింది.అదే విషయాన్ని చంద్రబాబు చెబితే దానికి ఎక్కువ ప్రభావం ఉంటుంది. విలువ ఉంటుంది.కాని ఆయన లీక్ లకే పరిమితం అవుతారు.అదే సమయంలో బిజెపి నేత పురందేశ్వరి రాష్ట్ర ప్రభుత్వం తన తప్పులు కప్పిపుచ్చుకుని కేంద్రంపై ఆరోపణలు చేస్తోందని ఇప్పటికే కేంద్రమంత్రి నితిన్ గడ్కరికి లేఖ రాశారు. ఈ విమర్శలు, ప్రతి విమర్శల సంగతి ఎలా ఉన్నా కాపర్ డామ్ నిర్మాణం నిలుపుదల చేయాలని కేంద్రం ఆదేశించింంది. దీంతో ఇది చాలా తీవ్ర రూపం దాల్చినట్లయిందనుకోవాలి.మరి కేంద్రం,రాష్ట్రం ఒక చోట కూర్చుని చర్చించి ఏ విధంగా పోలవరం పూర్తి అవుతుందన్నదానిపై ఆలోచన చేయవలసి ఉంది అలాకాకపోతే తెలుగుదేశం,బిజెపిలు రెండూ ఆంద్ర ప్రజల ముందు దోషులుగా నిలబడక తప్పదు.

tags : polavaram,bjp,tdp

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info