A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
రేవంత్ రెడ్డి రాజీనామా మిస్టరీ
Share |
January 19 2018, 5:13 am

కాంగ్రెస్ లో చేరిన కొడంగల్ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి రాజీనామా వ్యవహారం ఒక కొలిక్కి రాలేదుకాని, తెలంగాణ రాష్ట్ర సమితి మాత్రం రాజకీయంగా రేవంత్ ను దెబ్బతీయడానికి సన్నద్దం అవుతోంది.ఇప్పటికే పలువురు మంత్రులు రేవంత్ నియోజకవర్గం అయిన కొడంగల్ లో పర్యటించి, అక్కడ ఉన్న రేవంత్ అనుచరులను ఆకర్షించే పనిలో పడ్డారు.ఇక ముఖ్యమంత్రి కెసిఆర్ కూడా ఈ వ్యవహారాన్నిసీరియస్ గా తీసుకుని కొడంగల్ బాద్యతలను మంత్రి హరీష్ రావుకు అప్పగించారట.ఉప ఎన్నిక వస్తే రేవంత్ ను ఓడగొట్టడానికి అన్ని ఏర్పాట్లు చేయాలని టిఆర్ఎస్ నాయకత్వం భావిస్తోంది. అందులో భాగంగా హరీష్ రావు మెదక్,కరీంనగర్ ప్రాంతాల నుంచి తన అనుచరులు కొందరిని కొడంగల్ పంపించి అక్కడ రాజకీయాలు, సమస్యలు తదితర అంశాపై విషయ సేకరణ చేయిస్తున్నారట.ఉప ఎన్నిక రాకపోయినా, వచ్చే ఎన్నికలలో రేవంత్ ను ఓడించడానికి అవసరమైన వ్యూహ రచన టిఆర్ఎస్ చేస్తోందని అనుకోవాలి.

tags : revanth,resignation

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info