A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
చిత్ర నిర్మాతలకు సామాజిక బాద్యత ఉండాలి
Share |
September 19 2018, 8:17 am

హైదరాబాద్: చిత్ర నిర్మాతలు, దర్శకులకు మరీ ముఖ్యంగా బాలల చిత్ర నిర్మాతలు,
దర్శకులకు సామాజిక బాధ్యత అవసరం. కేవలం పిల్లలకు మాత్రమే కాకుండా, తల్లి
తండ్రులు, సమాజంలోని ఇతర వర్గాలకు చక్కని సందేశం ఇచ్చే సినిమాల నిర్మాణం పై
వారు దృష్టి నిలపాలని, ;ఇందీవరం షార్ట్ ఫిల్మ్ ప్రొడ్యూసర్ రామ ఇరగవరపు
అన్నారు. ముఖ్యంగా బాలల చిత్రాలను నిర్మించే నిర్మాత, దర్శకులు పిలల్లలో
ఆత్మ విశ్వాసాన్ని పెంచే విధంగా చక్కని కథలను తెరకెక్కించాలని అన్నారు.
ప్రపంచ బాలల చలనచిత్రోత్సవంలో ప్రదర్శనకు ఎంపికైన ;ఇందీవరం, చిత్రం ఈరోజు
ప్రసాద్ ఐ - మాక్స్ థియేటరులో ప్రదర్శించారు. ఈ సందర్బమగా చిత్ర కథా రచయిత
మూర్తి కనకాల, చిత్రంలో నటించిన బాల నటులతో కలిసి మీడియా సమావేశంలో రామ
ఇరగవరపు తమ మనసులోని మాటను పంచుకున్నారు. బాలల చిత్రాలు చిన్నారులలో మానసిక
పరివర్తనకు, చుక్కానిగా వారిని చక్కని పౌరులగా తీర్చి దిద్దేందుకు చుక్కానిగలా
ఉండాలని అన్నారు. ఇందీవరం చిత్రం వరసగా రెండవ సారి, ఆసియన్ పనోరమా విభాగంలో
ప్రదర్శనకు ఎంపిక అయిందని ఆమె తెలిపారు. ;ఇదే వ్యక్తిగతంగా తనకు తన చిత్ర
బృందానికి విజయం భావిస్తాను అని ఆమె సంతోషాన్ని వ్యక్త పరిచారు. ఇందీవరం
గోల్డెన్ ఎలిఫెంట్ పురస్కారం పొందుతుందన్న విశ్వాసాన్ని ఆమె వ్యక్త
పరిచారు.
చిత్ర కథను వివరిస్తూ రామ ఇరగవరపు, అక్రమ మార్గంలో వచ్చిన డబ్బును ఖర్చు
చేసేందుకు ఇష్ట పడని, ఓ చిన్నారి కథే 'ఇందీవర అని ఆమె తెలిపారు. చిత్ర కథా రచయిత
మూర్తి కనకాల చిత్రేకరణ పట్ల సంపూర్ణ సంతృప్తిని వ్యక్త పరిచారు. పిల్లల
డాక్టర్ గా పిల్లల మనోభావాలను దగ్గరగా చూసిన అనుభవంతో రచించిన కథకు దర్శకుడు
సంపూర్ణ న్యాయం చేశారని, అలాగే చిత్రంలో నటించిన పిల్లలు చక్కని నటన, హావ
భావాలను ప్రదర్శించారని, మూర్తి కనకాల అన్నారు.

tags : festival,,films

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info