A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
మనం సినిమా సెట్టింగ్ లు దగ్దం-నాగార్జున ఆవేదన
Share |
January 19 2018, 5:04 am

హైదరాబాద్ లోని ప్రతిష్టాత్మక సినీ స్టూడియా అన్నపూర్ణ స్టూడియోలో అగ్ని ప్రమాదం జరగడం అందరిని కలవరపరచింది.‘మనం’ సినిమాకు సంబంధించిన సెట్టింగ్‌కు నిప్పుంటుకోవడంతో మంటలు చెలరేగాయి.ఈ మంటలను ఆర్పడానికి అగ్ని మాపకదళాలు వచ్చాయి. విద్యుత్‌ షాక్‌ సర్క్యూట్‌ వల్లే ఈ ప్రమాదం జరిగి ఉంటుందని భావిస్తున్నారు.
కాగా దీనిపై సినీ నటుడు నాగార్జున మట్లాడుతూ ‘మనం’ సినిమా సెట్ పూర్తిగా కాలిపోవడంతో చాలా బాధగా ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. తన తండ్రి అక్కినేని నాగేశ్వరరావుతో కలిసి నటించిన సినిమా కావడంతో ఈ సెట్ ను చూసినప్పుడల్లా ఆయన గుర్తొచ్చేవారని అన్నారు. మనుషులే పోయినప్పుడు.. సెట్‌ కాలిపోతేముందిలే అన్న నాగర్జున.. ప్రమాదంలో ఎవరికీ గాయాలు కాకపోవడం సంతోషకరమైన విషయం అని వ్యాఖ్యానించారు.

tags : akkineni,fire,annapoorna

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info