A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
రైతులకు ఎనిమిది వేల చొప్పున ఇస్తాం-సి.ఎమ్
Share |
September 19 2018, 9:07 am

ఉమ్మడి ఆంద్రప్రదేశ్ రాష్ట్రంలో రైతులకు న్యాయం జరగలేదని ముఖ్యమంత్రి కెసిఆర్ అన్నారు.వచ్చే ఏడాది నుంచి రైతులకు ఎకరాకు ఎనిమిది వేల రూపాయలు ఇచ్చే కార్యక్రమం అమలు చేస్తామని ఆయన అన్నారు. రైతులకు పెట్టుబడి సాయంపై విమర్శలు సరికాదని ఆయన వ్యాఖ్యానించారు.గతంలో చాలా వ్యవస్థలు, నిధులు గ్రామ, మండల సమితుల చేతుల్లో ఉండేవని, కాంగ్రెస్‌ పార్టీ వాటిని కేంద్రీకృతం చేసిందని, దానినే భారతీయ జనతా పార్టీ కొనసాగిస్తోందని ఆయన అన్నారు. .నవరి 1 నుంచి రైతులకు 24 గంటలు విద్యుత్‌ సరఫరా చేయనున్నట్లు కేసీఆర్‌ తెలిపారు. ప్రాజెక్టులు పూర్తికాకూడదు, చెరువులు నిండకూడదు, ప్రజలకు తాగునీరు అందకూడదని కాంగ్రెస్‌ నేతలు కోరుకుంటున్నారని కెసిఆర్ ద్వజమెత్తారు.

tags : kcr, farmers

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info