A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
లూలూ గ్రూప్ తో చంద్రబాబు లాలూచీ..te
Share |
November 18 2017, 11:07 pm

లూలూ గ్రూప్ తో చంద్రబాబు లాలూచీ..ప్రైవేట్ సంస్థకు బెదిరింపులు!అంటూ తెలుగు గేట్ వే లో వాసిరెడ్డి శ్రీనివాస్ ఇచ్చిన ఈ కధనం ఆసక్తికరంగా ఉంది. దానిని చదవండి.
.............

దుబాయ్ కి చెందిన లూలూ గ్రూప్ తో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడికి అంత లాలూచీ ఉందా?. అంటే అవునంటున్నాయి ప్రభుత్వ వర్గాలు. దుబాయ్ కు చెందిన లూలూ గ్రూప్ అనే ఓ ప్రైవేట్ సంస్థ కోసం ఏపీ సర్కారు ఏకంగా బ్లాక్ మెయిల్ కు దిగిన వ్యవహారం అధికార వర్గాల్లో పెద్ద చర్చనీయాంశంగా మారింది. మౌలికసదుపాయాల శాఖ ముఖ్య కార్యదర్శిగా ఉన్న అజయ్ జైన్ అసలు అది నిబంధనలకు అనుకూలంగా ఉందా? లేదా అనే అంశాలను ఏ మాత్రం పరిశీలించకుండా అడ్డగోలుగా జీవోలు జారీ చేస్తున్నారని అధికార వర్గాలు పేర్కొంటున్నాయి. ఇంత కాలం భూ దందాలు..కబ్జాలు ప్రైవేట్ వ్యక్తులే చేయటం మనకు తెలుసు. కానీ ఇప్పుడు సర్కారు కూడా బ్లాక్ మెయిల్ భూ దందా చేస్తోంది. మర్యాదగా నీ భూమి మాకిచ్చి..మేమిచ్చిన చోట భూమి తీసుకుంటావా?. లేకపోతే భూ సేకరణ నోటిఫికేషన్ ఇచ్చి లాగేసుకోమంటావా? తేల్చుకో. ఇదీ ఓ ప్రైవేట్ సంస్థకు సర్కారు ఇఛ్చిన థమ్కీ. అంటే సర్కారు కూడా అచ్చం భూ దందాలు చేసే వారి తరహాలో బ్లాక్ మెయిల్ కు పాల్పడుతుందన్న మాట. అంతే కాదు సుమా..అసలు ప్రభుత్వం సూచించే భూ మార్పిడి స్కీమ్ కు ప్రైవేట్ వ్యక్తి/సంస్థ అంగీకరిస్తారా? లేదా అనే అంశాన్ని పరిగణనలోకి తీసుకోకుండా ‘సమయం ఆదా’ కోసం అంటూ ఏకంగా జీవో జారీ చేసి మరీ రిక్విజన్ ఫర్ ప్రాజెక్ట్ (ఆర్ఎఫ్ పి)తో ముందుకు సాగాలని ఆదేశించారంటే పరిస్థితి ఎలా ఉందో ఊహించుకోవచ్చు.

అంతే కాదు సర్కారు పెద్దలు అనుకున్నట్లు ఈ ప్రాజెక్టును లూలూ ఇంటర్నేషనల్ షాపింగ్ మాల్ లిమిటెడ్ కు అప్పగించాలని నిర్ణయించారు. ఈ సంస్థ విశాఖపట్నంలోని హార్బర్ పార్క్ ప్రాంతంలో అంతర్జాతీయ కన్వెన్షన్ సెంటర్ తో పాటు ఎగ్జిబిషన్ మాల్స్, మీటింగ్ హాల్స్, పార్కింగ్ ప్లేస్, స్టార్ హోటల్, రిటైల్ మాల్ కట్టాలని నిర్ణయించింది. ఈ ప్రాజెక్టు అప్పగింతలో పలు ఉల్లంఘనలు ఉన్నాయి. వాటిని కూడా జీవో రూపంలో ఓకే చేసేశారు. ప్రభుత్వ అవసరాల కోసం భూమి తీసుకోవటాన్ని ఎవరూ తప్పుపట్టరు. కానీ ఏకంగా ఓ దుబాయ్ కి చెందిన బడా వ్యాపార సంస్థ వ్యాపారం కోసం రాష్ట్రానికి మరో ప్రైవేట్ సంస్థకు చెందిన భూమిని బలవంతంగా లాక్కోవాలని చూడటం వెనక మతలేమిటో ఊహించుకోవటం పెద్ద కష్టం కాదు. వైజాగ్ లో అంతర్జాతీయ కన్వెన్షన్ సెంటర్ కట్టడాన్ని కూడా ఎవరూ ఆక్షేపించరు. కానీ అందుకు చంద్రబాబు సర్కారు అనుసరిస్తున్న తీరు ఏ మాత్రం ఆమోదయోగ్యం కాదని అంటున్నారు. ప్రభుత్వం చేతిలో దాదాపు పది ఎకరాలు ఉండగా..ప్రైవేట్ సంస్థకు చెందిన మూడున్నర ఎకరాలను బలవంతంగా తీసుకునే ప్రయత్నాలు సాగుతున్నాయి.

tags : telugu gateway, lulu,group, chandrababu

Latest News
*వైసిపి నేత భద్రతను తీసేసిన ప్రభ/త్వం
*నంది అవార్డులు -బాలకృష్ణ రియాక్షన్
*బ్రాహ్మని, ఉపాసన ల కలయిక
*రాక్షసులు అడ్డుపడుతున్నారు-చంద్రబాబు
*సిబిఐ మాజీ జెడి లక్ష్మీనారాయణ ఇంటిలో చోరి
*బోటు ప్రమాదం-మంత్రి ఉమా పై ఆరోపణ
*నా కుమారుడు సబ్ కాంట్రాక్టు చేస్తే తప్పేంటి-మంత్రి
*మంత్రి నారాయణ మాట నమ్మశక్యమేనా?
*నంది అవార్డులు రఘువీరా స్పందన
*పోలవరం-కెవిపి పిల్ టిడిపికి ఉపయోగమేనా
*సెక్యులర్ పార్టీలతో కలుస్తాం-మాయావతి
*సింగపూర్ ను అందుకునే యత్నం-చంద్రబాబు
*టిడిపి కోవర్టులకే అవార్డులు ఇచ్చారు-మరో నటుడు
*ఆ భూకంపం నష్టం మూడు లక్షల కోట్లు
*పోలవరం లో కొన్నిపనులకు కొత్త టెండర్లు
*బాలకృష్ణకు ఘాటు రిప్లై ఇచ్చిన వైసిపి ఎమ్మెల్యే
*సామాజిక న్యాయానికి పెద్దపీట-పవన్ కళ్యాణ్
*చీటింగ్ కేసు పెట్టిన ప్రముఖ నటుడి సోదరి
*ఎసిపబిపై కి కుక్కలను వదలిన అదికారి
*పురందేశ్వరి,కన్నా డూప్లికేట్ బిజెపి నాయకులు-మంత్రి
*సింగపూర్ ఒప్పందం- కొన్ని ఇబ్బందులు-మంత్రి
*టిడిపి పవర్ లోకి వస్తే అగ్రవర్ణాలకు మూడే పదవులు
*గ్రీన్ ట్రిబ్యునల్ తీర్పుపై పిటిషనర్ వ్యాఖ్య
*ఎమ్మెల్యేల‌కు మంత్రి ఇంద్ర‌క‌ర‌ణ్ రెడ్డి లేఖ 
*రేవంత్ సేఫ్ గేమ్ ఆడుతున్నారట
*జయలలిత ఇంటిలో ఐటి సోదాలు
*ఏభై రోజులు సభ జరుపుతామన్నారుగా
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info