A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
బోట్ ప్రమాదం-ముఖ్యమంత్రి ప్రకటన
Share |
June 19 2018, 12:26 pm

విజయవాడ వద్ద కృష్ణానదిలో ప్రమాదానికి గురైన బోట్ కు అనుమతి లేదని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చెప్పారు. శాసనసభలో దీనిపై ఒక ప్రకటన చేశారు. పద్దతి ప్రకారం పూర్తి స్థాయి అనుమతి తీసుకుని , తగు శిక్షణ ఇచ్చి బోట్లు నడిపి ఉంటే ఈ ప్రమాదం జరిగేది కాదని ఆయన అన్నారు. ఇది బాద్యతా రాహిత్యం అని ఆయన అన్నారు.ఈ ఘటన చాలా బాదాకరమని ఆయన అన్నారు. కొందరు మత్స్యకారులు నడికుర్తి పిచ్చయ్య,శివయ్య లు పడవ బోల్తా పడినప్పుడు కొందరిని రక్షించారని ఆయన అన్నారు. కొందరు బాద్యతా రహితంగా వ్యవహరించారని, తగు అనుమతులు లేకుండా బోట్ నడిపారని,దీనిపై గట్టిగా విచారణ చేస్తామని, రాజీ లేకుండా వ్యవహరిస్తామని ఆయన అన్నారు. ఇలాంటి ఘటనలు జరగరాదని ఆయన అన్నారు.కొందరు బాదితులు తన వద్ద ఆవేదన వ్యక్తం చేశారని, ఇలాంటి ఘటనలు జరగకుండా చూడాలని కోరారని ఆయన అన్నారు. బాదిత కుటుంబాలకు పదిలక్షల రూపాయల చొప్పున ఆర్దిక సాయం ఇస్తామని ఆయన అన్నారు.అంతర్జాతీయ స్థాయిలో ఉన్న నిపుణులను సంప్రదించి , ఇలాంటి ఘటనలు జరకుండా చర్యలు చేపడతామని చంద్రబాబు చెప్పారు.

tags : chandrababu, boat accident

Latest News
*మాజీ సి.ఎమ్.పై భూ ఆక్రమణ కేసు
*అసలు చంద్రబాబుకు ఏమైంది-టిడిపి మల్లగుల్లాలు
*కాల్పులలో యువగాయకుడు బలి
*ఆ పత్రిక సర్వే అంతా ఆత్మహత్యా సదృశమే--సువేరా
*ట్విటర్ నాయుడుగా లోకేష్ మారారు
*తెలుగుదేశం పులా..పులి వేషమా
*jకిరణ్ కుమార్ రెడ్డి కాంగ్రెస్ లోకి వస్తే
*రాజ్యసభ డిప్యూటి చైర్మన్ రేసులో కెకె
*రేషన్ షాపులకు చంద్రబాబు వింత ఆదేశం
*అత్యాచారాలపై పవన్ స్పందన
*ప్రముఖ మిమిక్రీ కళాకారుడు నేరేళ్ల కన్నుమూత
*ఆంద్రజ్యోతి సర్వే నీతిమాలిన సర్వే-రోజా
*ఈఫెల్ టవర్ కు బుల్లెట్ ప్రూప్ అద్దాలు
*జగన్ నడిచే రో్డ్డు, తాగే నీరు..అన్నీ మావే-టిడిపి
*చంద్రబాబు డిల్లీలో పిల్లి అయిపోయారే
*ఒక ఇసుక ర్యాంప్ కు లోకేష్ పేరు పెట్టారట
*చంద్రబాబుపై కేసు పెడతాం- బిజెపి నేత
*ఆ రిటైర్డ్ పోలీస్ ఆఫీసర్లు ఉద్యమంలో దిగుతారా
*నాయీ బ్రాహ్మణులనే ఈనాడు కూడా తప్పు పట్టిందా
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info