A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
రేవంత్ ను ఓడించే బాద్యత హరీష్ రావుకు
Share |
January 19 2018, 5:09 am

టిడిపి నుంచి కాంగ్రెస్ లో చేరిన రేవంత్ రెడ్డి నియోజకవర్గమైన కొడంగల్ లో ఒక పట్టు పట్టడానికి టిఆర్ఎస్ సన్నద్దం అవుతోంది.ఈ బాద్యతలను ముఖ్యమంత్రి కెసిఆర్,మంత్రి హరీస్ రావు కు అప్పగించినట్లు కధనాలు సూచిస్తున్నాయి.రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి కెసిఆర్ పై దూకుడుగా ఉండే సంగతి తెలిసిందే.రేవంత్ రాజీనామా వ్యవహారం ఇంకా తేలకపోయినా, ఒక వేళ ఉప ఎన్నిక వచ్చినా, లేదా సాధారణ ఎన్నికలలో అయినా రేవంత్ ను కొడంగల్ లో ఓడించడానికి వీలుగా ఇప్పటి నుంచే టిఆర్ఎస్ సన్నాహాలు చేస్తోందట.పలువురు మంత్రులు ఇప్పటికే కొడంగల్ పై దృష్టి పెట్టినా,ప్రత్యేకంగా హరీష్ రావుకు బాద్యతలు ఇచ్చారు.ఆయన తన కు సంబందించిన నలభై మందిని కరీంనగర్,మెదక్ ల నుంచి రప్పించి కొడంగల్ లో స్టడీ చేయడానికి పంపించారట. మొత్తం మీద రేవంత్ కు టిఆర్ఎస్ కు మధ్య హోరాహోరీ యుద్దమే జరుగుతుందా!

tags : harish, revanth, kodangal

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info