A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
రెండేళ్లలో నీటి ప్రమాదాల వల్ల 2493 మంది మృతి
Share |
December 12 2018, 8:18 am

నీళ్లలో మునిగిపోవడం వల్ల గత రెండేళ్లలో దాదాపు 2500 మంది చనిపోయారన్న వార్త మీడియాలో వచ్చింది. ఇది ఆందోళన కలిగించే విషయమే. ఆంద్రప్రదేశ్ లో నీట మునగడం కారణంగా ఇంత మంది మరణించారా అన్నది ఆశ్చర్యంగానే ఉంటుంది.అది బోటు ప్రయాణం కావచ్చు. మరొకటి కావచ్చు ,ప్రమాదాల వల్ల ఇందరు చనిపోయారని లెక్కలు చెబుతున్నాయి.
2014, 2015 సంవత్సరాల్లో ఆంధ్రప్రదేశ్‌లో ఈ తరహా ప్రమాదాలు 2276 చోటుచేసుకోగా.. మొత్తం 2493 మంది మృత్యువాత పడ్డారని ఆ కధనం వల్లడించింది.బోటులో ప్రయాణించే వారి భద్రత విషయంలో ఉదాసీనంగా వ్యవహరించడం, తగిన అప్రమత్తత కొరవడటం, సంబంధిత శాఖల పర్యవేక్షణ లేమి ఫలితంగా అమాయకుల ప్రాణాలు బలైపోతున్నాయిని ఆ కధనంలో విశ్లేషించారు.అయితే బోటు ప్రమాదాలు పదహారు జరిగాయట.నీళ్లలో జారిపడిన ఘటనలు656 జరిగాయి.ఇతర కారణాల వల్ల 1608 ఘటనలు జరిగాయట.

tags : ap, water, accidents

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info