A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
ఎపి సి.ఎమ్.ఓపై హైకోర్టుకు వెళ్లిన ఐవైఆర్
Share |
April 26 2018, 3:18 pm

ఎపి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు కార్యాలయం రాజ్యాంగేతర శక్తిగా మారుతోందని ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి ఐవైఆర్ కృష్ణారావు ఏకంగా హైకోర్టుకు వెళ్లడం విశేషం.
దీనిపై చర్యలు తీసుకోవాలని ఆయన హైకోర్టును కోరారు. సీఎంవో పారదర్శకంగా పనిచేసేందుకు ఓ నిర్ధిష్ట విధానాన్ని రూపొందించేలా ప్రభుత్వాన్ని ఆదేశించాలని అభ్యర్థించారు. సీఎంవో పనితీరు సమర్థవంతంగా, బాధ్యతాయుతంగా, ప్రజల విషయంలో తక్షణమే స్పందించేందుకు వీలుగా ఏపీ సెక్రటేరియట్‌ ఆఫీస్‌ మాన్యువల్, ఏపీ బిజినెస్‌ రూల్స్‌కు సవరణలు చేసేలా ఆదేశాలివ్వాలని కోరారు.‘గతంలో నేను సీఎస్‌గా పనిచేశా. ఆ అనుభవంతో సీఎంవో పనితీరు ఎలా ఉంటుందో నాకు బాగా తెలుసు. సీఎంకు వచ్చే ఫైళ్లను పరిష్కరించేందుకు ఏర్పాటైన ఓ చిన్న వ్యవస్థే సీఎంవో. ఆ తరువాత కాలంలో సీఎంవో విస్తృతి పెరిగి సమాంతర సచివాలయంగా మారిపోయింది. ఇందులో ముఖ్యమంత్రి ఇష్టాఇష్టాల మేరకు ప్రత్యేక ప్రధాన కార్యదర్శులు, ముఖ్య కార్యదర్శులు, కార్యదర్శులు, సంయుక్త కార్యదర్శులు ఉంటారు. కొన్ని సందర్భాల్లో ఇతర సర్వీసుల్లోని అధికారులు, ఇతర కేడర్‌కు చెందిన అధికారులకు సైతం సీఎంవోలో స్థానం కల్పిస్తారు. ప్రస్తుతం సీఎంవోలో ప్రత్యేక ప్రధాన కార్యదర్శి, ముఖ్య కార్యదర్శి, కార్యదర్శి, అదనపు కార్యదర్శి ఉన్నారు. ఈ హోదాల్లో వీరు సీఎంకు తగిన సూచనలు, సలహాలు ఇస్తూ ఉంటారు. వీటికి సంబంధించి సీఎంవో ఎలాంటి రికార్డులను నిర్వహించడం లేదు. దీనికి సంబంధించి ఫైళ్లపై ఈ అధికారుల సంతకాలు కూడా ఉండటం లేదు. ఈ అధికారులు తమ సౌకర్యాన్ని బట్టి కొన్ని సందర్భాల్లో అనధికార నోట్స్‌ తయారు చేసి తరువాత ధ్వంసం చేస్తుంటారు.అని ఆయన తన పిటిషన్ లో తెలిపారని మీడియా సమాచారం.

tags : iyr, high court, ap cmpo

Latest News
*పవన్ కళ్యాణ్ పై కేసు నమోదు
*ఎపిలో బలమైన నేత జగన్-కేంద్ర మంత్రి
*ఇంద్రావతి తీరాన రక్తపుటేరులు
*చంద్రబాబు గురించే షిండే మాట్లాడారా
*కార్పొరేట్,ప్రవైటు స్కూళ్ల టీచర్లకు చట్టం-జగన్
*రెండు ప్రమాదాలు- పదిహేను మంది మృతి
*బాబు అవినీతికి ప్రజలు రక్షణగా ఉండాలా- వైసిపి
*గవర్నర్ ఆ రెండు గంటల్లో ఎవరిని కలిశారో
*51 వేల కోట్లు ఇస్తే రాజదాని కడతారాట
*నేనే మంచి గవర్నర్ ని అని రాస్తారు..
*వైసిపి ఎమ్మెల్యేపై చార్జీషీట్
*దర్శకుడు తేజా రీజన్ కరెక్టు అయి ఉంటుందా?
*ఇప్పుడు ఇక అన్నా క్యాంటీన్ ల కుంభకోణం
*సిద్దరామయ్యకు బిజెపి టైట్ చేసిందా
*కాంగ్రెస్,కులం,మత రాజకీయాలు చేస్తోంది
*పవన్ కళ్యాణ్ పై మంత్రి గంటా విమర్శలు
*జగన్ ,పవన్ కలుస్తారా
*అఖిలప్రియ గ్రాఫ్ పడిపోతోంది-బూమాతో కట్
*సిద్దరామయ్య ఉత్తరాది..దక్షిణాది అంటున్నారు
*ఈ కేసులలో ఆ ఎమ్మెల్యేలది రికార్డే
*సి.ఎమ్.పై బిజెపి వివాదాస్పద వ్యాఖ్య
*ఎపిలో ప్రభుత్వమే మాల్ కడుతుందట
*విపక్ష ఎమ్మెల్యేలకు చంద్రబాబు నిదులు ఇవ్వరా
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info