A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
పిహెచ్ సిలకు హార్వర్డ్ సాంకేతిక శిక్షణ
Share |
November 18 2018, 10:28 pm

ప్రాథ‌మిక ఆరోగ్య రంగంలో ల‌క్ష్యాల సాధ‌న‌కు సాంకేతికత‌, శిక్ష‌ణ వంటి స‌హ‌కారం అందించ‌డానికి ముందుకు వ‌చ్చింది హార్వ‌ర్డ్ యూనివ‌ర్సిటీ.  ఇప్ప‌టికే ప్ర‌పంచంలో ప‌లు దేశాల్లో ఇలాంటి స‌హ‌కారం అందిస్తున్న హార్వ‌ర్డ్ విశ్వ‌విద్యాల‌య ఆరోగ్య మాన‌వ వ‌న‌రుల విభాగానికి చెందిన స‌చిన్ బ‌ల్సారీ, త‌రుణ్ ఖ‌న్నాలు తెలంగాణ వైద్య
ఆరోగ్య‌శాఖ మంత్రి డాక్ట‌ర్ సి ల‌క్ష్మారెడ్డితో స‌చివాల‌యంలోని మంత్రి చాంబ‌ర్‌లో భేటీ అయ్యారు. ఈ భేటీకి వైద్య ఆరోగ్య‌శాఖ ఉన్న‌తాధికారులు కూడా హాజ‌ర‌య్యారు.  
హార్వ‌ర్డ్ విశ్వ‌విద్యాల‌యం ఆరోగ్య‌, మాన‌వ వ‌న‌రుల విభాగం ప్ర‌పంచ వ్యాప్తంగా ప్ర‌త్యామ్నాయ లక్ష్యాలు-
సాంకేతిక‌త‌-శిక్ష‌ణ రంగాల్లో ప‌లు దేశాలు, రాష్ట్రాల‌కు స‌హ‌కారం అందిస్తున్న‌ది. ఇందులో భాగంగా కొత్తగా ఏర్ప‌డ్డ
తెలంగాణ రాష్ట్రానికి, సీఎం కెసిఆర్ సార‌థ్యం, మంత్రి ల‌క్ష్మారెడ్డి నాయ‌క‌త్వంలో రాష్ట్రం వైద్య, ఆరోగ్య రంగంలో
సాధిస్తున్న ప్ర‌గ‌తిని గ‌మ‌నించి త‌మ వంతు స‌హ‌కారం అందించ‌డానికి ముందుకు వ‌చ్చింది. ప్రాథ‌మిక వైద్య
రంగంలో వ‌స్తున్న మార్పులు, ఆ రంగంలో చేప‌ట్టాల్సిన మార్పుల మీద చ‌ర్చించారు. అలాగే తెలంగాణ‌లో
ఇప్ప‌టికే సాంకేతిక‌త‌ను ఉపయోగించుకుని చేప‌ట్టిన మార్పుల‌ను కూడా చ‌ర్చించారు. అనంత‌రం హార్వ‌ర్డ్ విశ్వ
విద్యాల‌యం ఈ రంగంలో చేప‌ట్టిన ప్ర‌గ‌తిని కూడా ప‌రిశీలించారు. అనంత‌రం మంత్రి ల‌క్ష్మారెడ్డి మాట్లాడుతూ,
తెలంగాణ‌లో చేప‌ట్టిన ప‌లు సంస్క‌ర‌ణ‌లు, ప్ర‌గ‌తిని వారికి వివ‌రించారు. హార్వ‌ర్డ్ విశ్వ విద్యాల‌య స‌హ‌కారం
మ‌నకు ఏ మేర‌కు ఉప‌యోగ‌ప‌డుతుంది? మ‌న అవ‌స‌రాలు, వారిచ్చే స‌హ‌కారాన్ని బేరీజు వేయాల‌ని
సంబంధిత అధికారుల‌ను ఆదేశించారు. 
ఈ భేటీలో నారాయ‌ణ‌పేట ఎమ్మెల్యే ఎస్‌.రాజేంద‌ర్‌రెడ్డి, వైద్య ఆరోగ్య‌శాఖ ప్రిన్సిప‌ల్ చీఫ్ సెక్ర‌ట‌రీ రాజేశ్వ‌ర్ తివారీ,
వైద్య ఆరోగ్య‌శాఖ క‌మిష‌న‌ర్ వాకాటి క‌రుణ‌, వైద్య విద్య సంచాల‌కులు డాక్ట‌ర్ ర‌మేశ్‌రెడ్డి, నిమ్స్ డైరెక్ట‌ర్‌, ఆరోగ్య‌శ్రీ
సిఇఓ ప్రొఫెస‌ర్ మ‌నోహ‌ర్‌, వైద్య సంచాల‌కులు ల‌లిత కుమారి త‌దిత‌రులు పాల్గొన్నారు

tags : lakshmareddy

Latest News
*బాబూ మోహన్ కు నచ్చలేదు
*కెటిఆర్ సవాల్ ను స్వీకరిస్తా -షబ్బీర్
*పవన్ కళ్యాణ్ పై వైఎస్ ఆర్ కాంగ్రెస్ ఫైర్
*పరుగు తీసి నామినేషన్ వేసిన సిపిఐ రిబెల్
*విద్యార్ధినులకు స్కూటీలు- బిజెపి హామీ
*చంద్రబాబు రాజకీయ క్రీడ-ntr కుటుంబం ఓ పావు
*కెసిఆర్ ను జైలులో పెడతారట
*టిడిపి ముఖ్యనేతలకే సీట్లు లేవు
*హాయ్ లాండ్ పై చంద్రబాబు కొత్త డ్రామా
*ఎపి ప్రజలు ఇసుకపై టిడిపి టాక్స్ కడుతున్నారు
*పాపం కోదండరామ్..ఆయనకే సీటులేదు
*6 నెలలపాటు సిబిఐ,ఐటి ..ఏవీ పనిచేయకూడదట
*జగన్ కేసు- ఆ చొక్కాను కోర్టుకు ఇవ్వండి
*పవన్ కళ్యాణ్ టిడిపి ఎపి అద్యక్షుడి ప్రశ్నలు
*కాంగ్రెస్ కు మరో మాజీ మంత్రి గుడ్ బై
*మల్లయ్య యాదవ్ కు కోదాడ trs టిక్కెట్
*కాంగ్రెస్ కు మాజీ మంత్రి శంకరరావు గుడ్ బై
*ఇదేం బాలకృష్ణ అండి బాబూ!
*అగ్రిగోల్డ్ బాదితులను నిలువునా ముంచేశారు
*టిడిపికి తెలంగాణలో ముఖం లేకుండా పోయింది
*అయ్యా రాహుల్ అబద్దం చెప్పినా అతికేలా ..
*గుండెకోత- ఇద్దరు ఇంజనీరింగ్ విద్యార్ధులు మృతి
*స్పెషల్ ఫ్లైట్ లలో తిరిగే చంద్రబాబుకు..
*మోడీకి కాంగ్రెస్ సమాదానం
*జగన్ ను ఒంటరిగా ఎదుర్కోలేకే
*మళ్లీ యజ్ఞం చేయనున్న కెసిఆర్
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info