A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
చంద్రబాబు చేతులు ఎత్తివేసినట్లేనా
Share |
November 18 2018, 10:01 pm

తెలంగాణ తెలుగుదేశం వర్కింగ్ అద్యక్షుడు రేవంత్ రెడ్డి ప్రకంపనలు సృష్టిస్తున్నారు.ఆయన కాంగ్రెస్ లో చేరడం దాదాపు ఖాయమైన నేపద్యంలో చేస్తున్న వ్యాఖ్యలు తెలుగుదేశం పార్టీని కలవరపరిచేవే.పైకి ఎపి టిడిపి నేతలు బింకంగా మాట్లాడుతున్నా, లోపల వారికి బిపి పెరిగే పరిస్థితి ఏర్పడింది.నిత్యం విపక్ష నేత జగన్ పైన, ఆయన పార్టీ వైఎస్ ఆర్ కాంగ్రెస్ పైన ఆడిపోసుకుంటూ కాలం గడుపుతున్న తెలుగుదేశం నేతలను రేవంత్ ఒక రకంగా భయపెట్టారని చెప్పవచ్చు.ఆయన ఎవరిమీద ఏమి బాంబు వేస్తారో తెలియక వారంతా తికమక పడుతున్నారు. టిఆర్ఎస్ తో వైఎస్ ఆర్ కాంగ్రెస్ కుమ్మక్కయిందని,ఇంకా ఏవోవే ఆరోపణలు చేసి జనాన్ని నమ్మించాలని ప్రయత్నించే ఎపి టిడిపి నేతల అసలు రంగును ఆ పార్టీ నేతే అయిన రేవంత్ బయటపెట్టేశారు.తెలంగాణ రాష్ట్ర సమితితో అంటకాగడానికి టిడిపి ఎపి నేతలు ప్రయత్నించారని దీనివల్ల తేటతెల్లమవుతోంది.పైగా ఆర్దిక మంత్రి యనమల రామకృష్ణుడుకు రెండువేల కోట్ల రూపాయల విలువైన కాంట్రాక్టులు టిఆర్ఎస్ ప్రభుత్వం ద్వారా వచ్చాయని, అందుకే కెసిఆర్ జోలికి వెళ్లరని రేవంత్ అన్నారు.యనమల నేరుగా కాంట్రాక్టులు చేస్తారన్న విషయం తెలియదు. ఆయన వియ్యంకుడికి కాంట్రాక్టు వ్యాపారాలు ఉన్నాయి.వారికి ఏమైనా ఇప్పించారా లేక యనమలే తీసుకున్నారా అన్నది చూడాలి.అయితే ఇదేమంత తప్పు కాదన్నట్లుగా ఆంద్రా కాంట్రాక్టర్లు దేశం అంతటా కాంట్రాక్టులు చేస్తున్నారని టిడిపి ఎమ్మెల్సీ బాబూ రాజేంద్రప్రసాద్ అన్నారు. మరి వైఎస్ ఆర్ కాంగ్రెస్ వాళ్లు ఎవరైనా కాంట్రాక్టులు చేస్తే ఇంకేముందని టిడిపి ఎపి నేతలు ఎందుకు గగ్గోలు పెట్టేవారో కూడా వివరిస్తే బాగుంటుంది.ఇక రేవంత్ మరో నేత పయ్యావుల కేశవ్ పై కూడా విమర్శల వర్షం కురపించారు. కేశవ్, రేవంత్ లు నిజానికి మంచి స్నేహితులే వారిద్దరి మధ్య ఏమైందో తెలియదు కాని, ఆయన కుటుంబానికి , పరిటాల కుటుంబానికి తెలంగాణలో మద్యం వ్యాపారాలు ఉన్నాయని కూడా రేవంత్ ప్రకటించారు.అవన్ని కెసిఆర్ ద్వారా వీరు పొందారన్న భావం వచ్చేలా రేవంత్ విమర్శలు సాగించారు.అసలు తగాదా అంతా కెసిఆర్ అనంతపురం పర్యటనతోనే మొదలైంది. అక్కడ టిడిపినేతలు కెసిఆర్ కు చేసిన సపర్యలనండి, మర్యాదలనండి ..వాటిని చూసిన తర్వాత రేవంత్ కు ఒళ్లు మండింది.పైగా కేశవ్ తో ప్రత్యేకంగా కెసిఆర్ మాట్లాడడం పెద్ద వివాదం అయింది.రేవంత్ మిగిలిన టిడిపి నేతలను విమర్శించారు కాని, ఇంకా చంద్రబాబు పైకి వెళ్లలేదు.వాస్తవానికి చంద్రబాబు కూడా కెసిఆర్ కోసం అరగంట సేపు వేచి ఉండి ఆయనకు స్వాగతం చెప్పి మరీ వెళ్లారు.ఆ విషయాన్ని రేవంత్ ప్రస్తావించడం లేదు. అయితే అదే సమయంలో వరంగల్ లో టిడిపినేత సీతక్క కుటుంబంలో పెళ్లికి చంద్రబాబు నాయుడు వస్తే టిఆర్ఎస్ ముఖ్యనేతలు కాని,గతంలో టిడిపిలో ఉండి ఇప్పుడు టిఆర్ఎస్ లో ఉన్న కడియం శ్రీహరి, ఎర్రబెల్లి దయాకరరావు వంటివారు కాని పట్టించుకోలేదట.ఈ విషయాలన్ని రేవంత్ బయటపెట్టి మరీ కడిగేశారు.మోత్కుపల్లి నరసింహులు ద్వారా చంద్రబాబే టిఆర్ఎస్ తో పొత్తు గురించి ప్రస్తావించారన్నది రేవంత్ వర్గం అనుమానం.దానికి ఈయన ససేమిరా అంటారు.కాంగ్రెస్ తో పొత్తు వద్దని గతంలో చంద్రబాబు అన్నా,రేవంత్ దానిని పెద్దగా పట్టించుకోలేదు. సింరేణి ఎన్నికలలో పిసిసి అద్యక్షుడు ఉత్తం కుమార్ రెడ్డి తో కలిసి పనిచేశారు. ఆ సందర్భంలో పార్టీ ఇతర ముఖ్య నేతలు రమణ, రావుల చంద్రశేఖరరెడ్డి వంటి వారు కూడా కాంగ్రెస్ ,తదితర పక్షాల నేతలతో కలిసిపని చేశారు.తెలంగాణలో టిడిపిని ఇప్పటికే కెసిఆర్ దెబ్బతీశారు. ఓటు నోటు కేసుతో చంద్రబాబును హైదరాబాద్ నుంచి పంపించేసిన కెసిఆర్ ,టిడిపి ఎమ్మెల్యేలుపన్నెండుమందిని టిఆర్ఎస్ లో చేర్చుకున్నారు. ఓటుకు నోటు కేసుకు ముందు చంద్రబాబు ఆయా సందర్భాలలో కెసిఆర్ పై తీవ్ర విమర్శలు చేస్తుండేవారు. తెలంగాణలో పార్టీ అదికారంలోకి వచ్చే వరకు హైదరాబాద్ లోనే ఉంటానని చంద్రబాబు అనేవారు.అలాంటి నేత ఇప్పుడు కెసిఆర్ ను పల్లెత్తు మాట కూడా అనడం లేదు.ఈ విషయాలన్ని తెలంగాణ టిడిపి నతలు గమనిస్తూనే ఉన్నారు. ఓటు కు నోటు కేసులో రేవంత్ జైలుకు వెళ్లవలసి వచ్చింది. చంద్రబాబు మాత్రం పైస్తాయిలో రాయబారాలు చేసి కెసిఆర్ తో రాజీ కుదుర్చుకున్నారు.ఆ తర్వాత తెలంగాణ లో పార్టీ నిలబడదన్న అభిప్రాయం ఏర్పడింది.అందువల్ల రేవంత్ కు ఇప్పుడు ఉన్న పరిస్థితిలో కాంగ్రెస్ తప్ప గత్యంతరం లేదు.బిజెపి తెలంగాణలో పుంజుకుంటున్నదన్న నమ్మకం ఎవరికి ఏర్పడలేదు.దానికి తోడు సామాజిక వర్గాల సమీకరణ కూడా మారుతోంది.కమ్మ సామాజికవర్గాన్ని కెసిఆర్ ఆకర్షించే ప్రయత్నం చేస్తున్నారన్న అబిప్రాయంఏర్పడింది.దానికి ప్రతిగా రెడ్లు అంతా ఒకటి అవ్వాలని కాంగ్రెస్ నేత జగ్గారెడ్డి వంటివారు బహిరంగంగానే పిలుపు ఇస్తున్నారు.తెలంగాణలో ఏర్పడుతున్న పరిణామాలలో చంద్రబాబు నాయుడు నిస్సహాయంగా మిగిలిపోతుంటే, టిడిపి నేతలు ఎవరి దారి వారు చూసుకోవల్సిన పరిస్థితి ఏర్పడింది.అందువల్ల రేవంత్ దీపం ఉండగానే ఇల్లు చక్కపెట్టుకోవాలన్న చందంగా కాంగ్రెస్ దారి చూసుకుంటున్నారు. ఆయనతో పాటు ఎందరు వెళతారు? ఎందరు ఆయనను విభేదించి టిఆర్ఎస్ లో చేరతారు?మరికొందరు బిజెపివైపు ఏమైనా వెళ్లవచ్చా?అన్న ప్రశ్న కూడా ఉన్నా,ఇప్పటికైతే తెలంగాణలో బలంగా ఉన్న కాంగ్రెస్ పార్టీనే బెటర్ అనుకుంటున్న వారి సంఖ్య అదికంగా ఉంది.ఒక సమాచారం ప్రకారం ఓటు నోటు కేసు వరకు ఇబ్బంది పెట్టబోనని చంద్రబాబుకు రేవంత్ భరోసా ఇచ్చారని అంటున్నారు.అయితే రాజకీయాలు ఎప్పుడు ఎలా మారతాయో తెలియదు. టిడిపి నేతలు ఇప్పటికే రేవంత్ పార్టీ నుంచి పోతే ఏమీ కాదని వ్యాఖ్యానించారు.వారిలో ఎవరైనా రెచ్చగొడితే ఓటుకు నోటు కేసులో అసలు వాస్తవాలు రేవంత్ బయటపెట్టే ప్రమాదం ఉంది. అందుకే మరీ తీవ్రంగా రేవంత్ పై మాట్లాడే ధైర్యం టిడిపి నేతలు చేయకపోవచ్చు. చంద్రబాబు కూడా తెలంగాణలో పూర్తిగా తట్టబుట్ట సర్దుకున్నందున తెలంగాణ పార్టీపై పెద్దగా శ్రద్ద పెట్టడం లేదు.ఇప్పుడు రేవంత్ ఎపి తెలుగుదేశం నేతలపై చేసిన ఆరోపణలను ఎదుర్కోవడం, ప్రజలలో దాని వల్ల వచ్చే నష్టాన్ని తగ్గించుకునే పనిలో చంద్రబాబు ఉండవచ్చు.ఎపిలో విపక్ష వైఎస్ ఆర్ కాంగ్రసె్ ఎమ్మెల్యేలు, ఎమ్.పిలను కొనుగోలు చేయడంలో బిజీగా ఉన్నారన్న ఆరోపణలు ఎదుర్కుంటున్న చంద్రబాబు తెలంగాణ వరకు చేతులెత్తేసినట్లే అనుకోవాలి.(గ్రేట్ ఆంధ్రలో ప్రచురితం)

tags : tdp, crisis

Latest News
*బాబూ మోహన్ కు నచ్చలేదు
*కెటిఆర్ సవాల్ ను స్వీకరిస్తా -షబ్బీర్
*పవన్ కళ్యాణ్ పై వైఎస్ ఆర్ కాంగ్రెస్ ఫైర్
*పరుగు తీసి నామినేషన్ వేసిన సిపిఐ రిబెల్
*విద్యార్ధినులకు స్కూటీలు- బిజెపి హామీ
*చంద్రబాబు రాజకీయ క్రీడ-ntr కుటుంబం ఓ పావు
*కెసిఆర్ ను జైలులో పెడతారట
*టిడిపి ముఖ్యనేతలకే సీట్లు లేవు
*హాయ్ లాండ్ పై చంద్రబాబు కొత్త డ్రామా
*ఎపి ప్రజలు ఇసుకపై టిడిపి టాక్స్ కడుతున్నారు
*పాపం కోదండరామ్..ఆయనకే సీటులేదు
*6 నెలలపాటు సిబిఐ,ఐటి ..ఏవీ పనిచేయకూడదట
*జగన్ కేసు- ఆ చొక్కాను కోర్టుకు ఇవ్వండి
*పవన్ కళ్యాణ్ టిడిపి ఎపి అద్యక్షుడి ప్రశ్నలు
*కాంగ్రెస్ కు మరో మాజీ మంత్రి గుడ్ బై
*మల్లయ్య యాదవ్ కు కోదాడ trs టిక్కెట్
*కాంగ్రెస్ కు మాజీ మంత్రి శంకరరావు గుడ్ బై
*ఇదేం బాలకృష్ణ అండి బాబూ!
*అగ్రిగోల్డ్ బాదితులను నిలువునా ముంచేశారు
*టిడిపికి తెలంగాణలో ముఖం లేకుండా పోయింది
*అయ్యా రాహుల్ అబద్దం చెప్పినా అతికేలా ..
*గుండెకోత- ఇద్దరు ఇంజనీరింగ్ విద్యార్ధులు మృతి
*స్పెషల్ ఫ్లైట్ లలో తిరిగే చంద్రబాబుకు..
*మోడీకి కాంగ్రెస్ సమాదానం
*జగన్ ను ఒంటరిగా ఎదుర్కోలేకే
*మళ్లీ యజ్ఞం చేయనున్న కెసిఆర్
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info