A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
జడ్చర్ల నుంచి రేవంత్ పోటీచేస్తారా
Share |
August 22 2018, 1:22 am

వచ్చే శాసనసభ ఎన్నికలలో కాంగ్రెస్ తరపున జడ్జర్ల నుంచి పోటీచేయాలని టిడిపి నుంచి వైదొలగాలని నిర్ణయించుకున్న రేవంత్ రెడ్డి భావిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. మహబూబ్ నగర్ జిల్లా జడ్జర్ల కు మంత్రి సి.లక్ష్మారెడ్డి ప్రాతినిద్యం వహిస్తున్నారు.టిఆర్ఎస్ కు బలమైన కేంద్రంగా ఉన్న జడ్జర్లలో ప్రస్తుతం మాజీ విప్ మల్లు రవి కాంగ్రెస్ ఇన్ చార్జీగా ఉన్నారు.ఆయనను తప్పించి రేవంత్ కు టికెట్ ఇవ్వవలసి ఉంటుంది.కాని మల్లు రవి మాత్రం తనకు జడ్జర్ల సీటు కావాలని పట్టుబడుతున్నారట. కాని అక్కడ సామాజికవర్గాల నేపధ్యంలో రేవంత్ వైపు కొందరు నేతలు మొగ్గు చూపుతున్నారు. కాగా దీనిపై మంత్రి లక్ష్మారెడ్డి స్పందిస్తూ, స్థానికుడు కాకపోతే కల్వకుర్తిలో ఎన్.టి.రామారావునే ఓడించారని,రేవంత్ ఎంత అని వ్యాఖ్యానించారు. వచ్చే పదేళ్లు టిఆర్ఎస్ దే అదికారం అని ఆయన అన్నారు.

tags : revanth,zadcharla

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info