A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
హీరో, డైరెక్టర్ ల ప్రతిఫలం లో 25% చెల్లించాలి..
Share |
January 20 2018, 1:00 pm

తెలుగు సినిమా రంగంలో విశేషమైన ఒక నిర్ణయం జరగవచ్చని ఒక వార్త వచ్చింది.దీని ప్రకారం ఏదైనా సినిమా విడుదల అయిన తర్వాత భారీ నష్టాలను ఎదుర్కుంటే ,అందుకు హీరోగా నటించిన ప్రముఖుడు, దర్శకుడు కూడా బాద్యత వహించాలన్న నిర్ణయం చేయాలని ఒక కమిటీ సిపారస్ చేసింది.ఇందుకోసం హీరోకి, దర్శకులకు ఇచ్చే పారితోషికంలో ఇరవై ఐదు శాతం మొత్తాన్ని సినీ నిర్మాత పక్కనపెడతారట.ఆ మొత్తాన్ని ప్రొడ్యూసర్ కౌన్సిల్ వద్ద డిపాజిట్ చేయవలసి ఉంటుందట.ఆ సినిమా విజయవంతం అయితే ఆ డబ్బును హీరో,డైరెక్టర్ లకు ఇచ్చేస్తారు.లేని పక్షంలో భారీ నష్టం వస్తే ఆ మొత్తాన్ని నష్టపోయిన సినిమా కొనుగోలుదారులకు చెల్లించాలని ప్రముఖ ప్రొడ్యూసర్ ల కమిటీ సిఫారస్ చేసింది.దీనిపై అక్టోబర్ 24 న జరిగే సినీ ప్రముఖుల సమావేశంతో తుది నిర్ణయం తీసుకుంటారు.సిని నిర్మాతలు సురేష్ బాబు,దిల్ రాజు,సునీల్ నారంగ్ లు ఈ కమిటీ లో సభ్యులుగా ఉన్నారు.ప్రముఖ దర్శకుడు రాజమౌళి, బోయపాటి శ్రీనివాస్ ,వినాయక్, శ్రీను వైట్ల తదితరులు పదిహేను కోట్ల వరకు ప్రతిఫలం తీసుకుంటారట. హీరోలు పవన్ కళ్యాణ్, జూనియర్ ఎన్.టి.ఆర్.మహేష్ బాబు,నాగార్జున తదితరులు ఎనిమిది కోట్ల నంచి ముప్పై కోట్ల వరకు వారి రేంజ్ ను బట్టి ప్రతిఫలం తీసుకుంటారట.

tags : telugu, film, industry, hero,director

Latest News
*అమెరికా ప్రభుత్వం మూత పడిందట
*నీతి ఆయోగ్ వ్యాఖ్యలపై కాంగ్రెస్ ద్వజం
*తిరుమలపై వ్యాఖ్యలు-కనిమొళిపై కేసు
*ఏకకాల ఎన్నికలపై మోడీ ఉద్ఘాటన
*మానభంగం దృశ్యాలపై కృష్ణంరాజు వ్యాఖ్యలు
*రాజధానికి పంపిన డబ్బును ఏమి చేసినట్లు!
*బిసిలపట్ల కెసిఆర్ కమిట్ మెంట్
*చంద్రబాబుకు ఉమ్మారెడ్డి సలహా
*22 నుంచి పులుల సర్వే
*హైదరాబాద్ లో మళ్లీ ఇంకుడు గుంతలు
*రజనీకాంత్ ను బిజెపి ఎగదోస్తోంది
*అందుకే వర్మను భార్య,కూతురు వెలిశారు
*ఎపి ప్రజలు చేతకానివాళ్లుకారు-బాబు స్పీచ్
*లైంగిక వేధింపుల కేసులో జర్మన్ సస్పెండ్
*తెలంగాణలో పంటల వాతావరణం లేదు-ఎపి
*పవన్ ఎఫైర్స్ - జ్యతి కధనం-ఆంతర్యం
*మోడీని చంద్రబాబు ఆ ఒక్కటైనా అడిగి ఉంటారా
*రిపబ్లిక్ టివీ సర్వేలో ఎంత వాస్తవం..
*పిసిఎం లో పెరుగుతున్న విబేధాలు
*ఆ నదుల్లో స్నానం చేస్తే ఇంతే సంగతి
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info