A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
మాజీ మంత్రి శ్రీధర్ బాబుపై కేసు-ఆడియో!
Share |
April 26 2018, 3:17 pm

తెలంగాణ కాంగ్రెస్ నేత, మాజీ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు కు ఆడియో టేపు కేసు చుట్టుకుంది.ఆయన ఒక స్థానిక నాయకుడితో మాట్లాడిన విషయాలు టేపులో రికార్డు అయి, కేసుకు దారి తీసింది.ఒక టిఆర్ఎస్ నాయకుడిని గంజాయి కేసులో ఇరికించడానికి శ్రీధర్ బాబు సహకరించారన్నది ఆరోపణగా ఉంది. ఓడేడు మాజీ సర్పంచ్ సుదర్శన్ మాజీ మంత్రి శ్రీధర్ బాబుకు పోన్ చేసి ముత్తారం టిఆర్ఎస్ అద్యక్షుడు కిషన్ రెడ్డిపై గంజాయి కేసు పెడతానని పోన్ చేసినట్లుగా ఆడియోటేపు లో ఉంది.దానిని శ్రీధర్ బాబు ఖండించకుండా,కేసును హైదరాబాద్ లో పెడదామని, పని చేయండని అన్నట్లుగా టేపులో ఉంది.కిషన్ రెడ్డికి,శ్రీధర్ బాబు కు గత కొంతకాలంగా వబేధాలు సాగుతున్న నేపద్యంలో ఈ విషయానికి ప్రాదాన్యం ఏర్పడింది. కిషన్ రెడ్డి ఈ టేపు ఎలా వెళ్లిందో కాని, ఆయన టేపులతో సహా చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ లో కేసు పెట్టారు.కిషన్‌రెడ్డి ఫిర్యాదు ఆధారంగా శ్రీధర్‌బాబుపై కేసు నమోదుచేశామని డీసీపీ తెలిపారు. గంజాయి కేసులో తనను ఇరికించేందుకు శ్రీధర్‌బాబు ప్రయత్నిస్తున్నారని పేర్కొంటూ శ్రీధర్‌బాబు, సుదర్శన్‌లకు సంబంధించిన ఆడియో టేపులో ఫిర్యాదుచేశారని ఆయన చెప్పారు.గతంలో ఎపి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆడియో టేపు లో దొరికిపోయినా, ఏమీ కాలేదు. ఇప్పుడు శ్రీధర్ బాబు విషయం ఏమి అవుతుందో చూడాలి.అయితే శ్రీధర్ బాబు సుదర్శన్ తర్వాత తనతో టచ్ లో లేడని చెబుతారో,లేక ఏమి వివరణ ఇస్తారో చూడాలి.

tags : sridhar babu, case, audio

Latest News
*పవన్ కళ్యాణ్ పై కేసు నమోదు
*ఎపిలో బలమైన నేత జగన్-కేంద్ర మంత్రి
*ఇంద్రావతి తీరాన రక్తపుటేరులు
*చంద్రబాబు గురించే షిండే మాట్లాడారా
*కార్పొరేట్,ప్రవైటు స్కూళ్ల టీచర్లకు చట్టం-జగన్
*రెండు ప్రమాదాలు- పదిహేను మంది మృతి
*బాబు అవినీతికి ప్రజలు రక్షణగా ఉండాలా- వైసిపి
*గవర్నర్ ఆ రెండు గంటల్లో ఎవరిని కలిశారో
*51 వేల కోట్లు ఇస్తే రాజదాని కడతారాట
*నేనే మంచి గవర్నర్ ని అని రాస్తారు..
*వైసిపి ఎమ్మెల్యేపై చార్జీషీట్
*దర్శకుడు తేజా రీజన్ కరెక్టు అయి ఉంటుందా?
*ఇప్పుడు ఇక అన్నా క్యాంటీన్ ల కుంభకోణం
*సిద్దరామయ్యకు బిజెపి టైట్ చేసిందా
*కాంగ్రెస్,కులం,మత రాజకీయాలు చేస్తోంది
*పవన్ కళ్యాణ్ పై మంత్రి గంటా విమర్శలు
*జగన్ ,పవన్ కలుస్తారా
*అఖిలప్రియ గ్రాఫ్ పడిపోతోంది-బూమాతో కట్
*సిద్దరామయ్య ఉత్తరాది..దక్షిణాది అంటున్నారు
*ఈ కేసులలో ఆ ఎమ్మెల్యేలది రికార్డే
*సి.ఎమ్.పై బిజెపి వివాదాస్పద వ్యాఖ్య
*ఎపిలో ప్రభుత్వమే మాల్ కడుతుందట
*విపక్ష ఎమ్మెల్యేలకు చంద్రబాబు నిదులు ఇవ్వరా
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info