A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
టిడిపి బుట్టలో పడ్డ రేణుక- ఒక విశ్లేషణ
Share |
August 22 2018, 1:22 am

కర్నూలు వైఎస్ ఆర్ కాంగ్రెస్ ఎమ్.పి బుట్టా రేణుక ఎట్టకేలకు తెలుగుదేశం బుట్టలో పడ్డారు. రేణుకపై తరచుగా ఫిరాయింపు వార్తలు వస్తుండడం, ఆమె ఖండించడం జరుగుతుండేది. 2014 లో గెలిచిన మరుసటి రోజే ఆమె భర్త ఢిల్లీలో ఎపి ముఖ్యమంత్రి చంద్రబాబు వద్దకు వెళ్లి టిడిపి తీర్ధం తీసుకున్నారు.అప్పుడే నంద్యాల ఎమ్.పి ఎస్పివై రెడ్డితో పాటు ఈమె కూడా పార్టీ మారుతారని బావించారు. కాని ఎందువల్లో ఆమె ఆగారు.ఆ తర్వాత వైసిపిలో చురుకుగా ఉన్నట్లు కనిపించేవారు. నంద్యాల ఉప ఎన్నికలో కూడా వైసిపి తరపున ప్రచారం చేశారు.అంతవరకు చంద్రబాబు చేస్తున్న అబివృద్ది గురించి పెద్దగా ఆమెకు కనపడలేదు. సడన్ గా కొద్ది రోజుల క్రితం ఆమెకు అంతా అభివృద్ది కనిపించింది. టిడిపి బుట్టలో పడడానికి ముందు ఆమె ఫిరాయింపులు సమాజానికి చెడ్డ సంకేతం ఇస్తాయని,ఏ పార్టీలో గెలిస్తే ఆ పార్టీలోనేఉండాలని ఆమె సుద్దులు చెప్పారు.ఇప్పుడు గాత్రం మార్చేశారు.ఒక సామాన్య గృహిణిగా ఉన్న రేణుకను వైఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ అదినేత జగన్ టిక్కెట్ ఇచ్చి ఎమ్.పిగా గెలిపించారు.అందుకు కృతజ్ఞతగా ఉండవలసిన ఆమె ఇతర సాదారణ రాజకీయ నేతల మాదిరే ఫిరాయింపు ద్రోహానికి పాల్పడ్డారు. ఆమె తన పదవికి రాజీనామా చేస్తే మంచిది.కాని ఇప్పుడు ఆ సంప్రదాయాలను తెలుగుదేశం పాటించడం లేదు.ఈ మొత్తం ఉదంతంలో తప్పు పట్టవలసిందిం ఎవరిని బుట్టా రేణుకనా?నలబై ఏళ్ల రాజకీయ సీనియారిటీ ఉందని చెప్పుకునే చంద్రబాబునా?రాజకీయం అంటే విలువలతో నిమిత్తం లేకుండా తన స్వార్దం కోసం ఏమైనా చేయడం అనే స్తాయికి చంద్రబాబు పరిస్తితి ని తెచ్చారు. పైగా మంచివాళ్లు తెలుగుదేశంలోకి వస్తారని ఆయన సుభాషితాలు చెబుతున్నారు. ఇలా ఫిరాయింపులు చేసేది మంచివాళ్లు చేసే పనేనా?ఒక్ టిడిపి ఎమ్మెల్సీ చక్రపాణిరెడ్డి పార్టీ మారదలిస్తే జగన్ ఏమి చేశారు? ఆయనతో పదవికి రాజీనామా చేయించిన తర్వాతే పార్టీలో చేర్చుకున్నారే?చంద్రబాబు వయసు ఎక్కడ? జగన్ వయసు ఏమిటి?జగన్ కు ఉన్న రాజకీయ విలువలు చంద్రబాబుకు లేవని మరోసారి రుజువు కాలేదా?వైసిపి ఎమ్మెల్యేలను 1 మందిని ఆకర్షించడం, వారిలో నలుగురు ఫిరాయింపుదారులకు మంత్రి పదవులు ఇవ్వడం వంటి అనైతిక చర్యలకు చంద్రబాబు దిగజారడం దురదృష్టకరం. చంద్రబాబు వీళ్లందరిని కోట్ల రూపాయలకు కొనుగోలు చేశారని విపక్షం ఆరోపిస్తోంది.గతంలో టిడిపి ఎమ్మెల్యేలను తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆ్ టిఆర్ఎస్ లో చేర్చుకున్నప్పుడు గాని, అంతకుముందు కాని చంద్రబాబు ఏమనేవారు..సంతలో పశువులను కొన్నట్లు కొంటున్నారని విమర్శించేవారే.ఆ లెక్కన చంద్రబాబు ఎన్ని కోట్లతో వీరందరిని కొంటున్ఆనరు. బుట్టా రేణుక కు డెబ్బైకోట్ల ప్యాకేజీ అని అంటున్నారు.తెలుగుదేశం నేతలకు బుట్టా కుటుంబం భారీగా అప్పులు పడిందట.దాంతో వారంతా ఒత్తిడి చేసి టిడిపిలోకి వస్తే చంద్రబాబు డబ్బులు ఇస్తారని, వాటితో తమ అప్పులు తీర్చవచ్చని చెప్పారని రాజకీయవర్గాలలో ప్రచారం జరుగుతోంది.మరో వైపు తెలంగాణ టిడిపి నేతలు ఫిరాయింపులను రాజకీయ వ్యభిచారం గా పోల్చుతూ టిఆర్ఎస్ పై ప్రకటనలు చేస్తుంటారు. మరి అదే విమర్శ చంద్రబాబుకు కూడా వర్తించదా?వీటన్నిటిని తలచుకుంటే బాధ కలుగుతుంది.ప్రధాని మోడీ రాజకీయ సంస్కరణలు తెచ్చి దేశానికి మేలు చేస్తారని అనుకుంటే ఆయన కూడా దిక్కుమాలిన ఫిరాయింపులను అరికట్టకపోగా, బిజెపిని కూడా అదే దారిలో నడిపిస్తున్నారు.ఇతరపార్టీల నుంచి నేతలను కొనుగోలు చేస్తే తప్ప, సొంతంగా జనం నుంచి నేతలను తయారు చేసుకోలేరా అన్న ప్రశ్న సహజంగానే వస్తుంది.సమాజాన్ని మార్చవలసిన నేతలే చెడ్డదారిలో నడవడమే కాకుండా అదేదో గొప్ప పని మాదిరి చెబుతుండడం అత్యంత శోచనీయం. ఇప్పటికైనా ప్రదాని మోడీ ఇలాంటి ఫిరాయింపుల విషయంలో తగు సంస్కరణలు తీసుకు రాకపోతే ఆయన కూడా ఈ తప్పుడు సంస్కృతిలో భాగం అయిపోతారు.జాగ్రత్త!

tags : tdp, butta

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info