A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
కెసిఆర్ తో కేశవ్ భేటీపై -చంద్రబాబు అసంతృప్తి!
Share |
June 24 2018, 12:53 am

ఎపి తెలుగుదేశం నేతలు ముఖ్యమంత్రి కెసిఆర్ తో సన్నిహితంగా మెలగడాన్ని , అనంతపురం జిల్లా పర్యటనలో జరిగిన పరిణామాలపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పందిచినట్లు తెలుగుదేశం మీడియాలో వచ్చిన కధనం ఆసక్తికరంగా ఉంది.పరిటాల శ్రీరామ్ పెళ్లికి కెసిఆర్ వచ్చినప్పుడు టిడిపి ఎపి నేతలు ఆయనతో సన్నిహితంగా మెలిగారని, అది సరికాదని,ఈ అంశంపై తెలంగాణ టిడిపి నేతలు అభ్యంతరం చెప్పారని చంద్రబాబు వ్యాఖ్యానించినట్లు ఈ కధనం చెబుతోది.తెలంగాణ పార్టీ నేతల మనోభావాలు కూడా గమనించాలి కదా అని ఆయన అన్నారట.తాను కూడా కెసిఆర్ ను కలిశానని,రెండు నిమిషాలు మాట్లాడి వెళ్లిపోయానని చంద్రబాబు పేర్కొన్నారట.పార్టీ నేతలు పరిది కి మించి వ్యవహరించారని సీనియర్ నేత పయ్యావుల కేశవ్ ను తప్పు పట్టారని ఆ కధనం చెబుతోంది.ఇలాగైతే తెలంగాణ టిడిపి నేతలు రాజీనామా చేసి వెళ్లిపోతామని హెచ్చరించారని కూడా తెలిపింది.కెసిఆర్ తో కేశవ్ భేటీని కూడా బాబు తప్పు పట్టారని ఆ కధనం చెబుతోంది.

tags : babu,kesva

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info