A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
అమరావతి- అనుకున్నదే వరల్డ్ బ్యాంక్ చెప్పింది
Share |
October 22 2017, 3:37 pm

ఎపి రాజధాని అమరావతి విషయంలో మొదటి నుంచి వస్తున్న ఆరోపణలను ప్రపంచ బ్యాంక్ విజిలెన్స్ బృందం కూడా ఖరారు చేసింది.ప్రపంచ బ్యాంక్ ఈ ప్రాజెక్టుకు రుణం ఇవ్వడానికి వ్యతిరేకత చూపడం లేదు.కాని అక్కడి రైతులు,నిర్వాసితుల విషయాలపై ప్రభుత్వం అసత్యాలు చెబుతోందని గర్తించింది.వాటిని పరిష్కరించాలని ప్రపంచ్ బ్యాంక్ బృందం అబిప్రాయపడింది.ప్రపంచంలోనే ఇంత పెద్ద ఎత్తున భూమి సమీకరించలేదని చెప్పే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రైతులందరిని మెప్పించి చేసి ఉంటే బాగుండేది.అలాకాకుండా,దానిని ఒక రియల్ ఎస్టేట్ వెంచర్ లా మార్చి,నల్లధనమో,తెల్లధనమో చెప్పకుండా కోట్ల రూపాయల లాభాలు వస్తాయని ఆశచూపి రైతులను ఆకట్టుకునే యత్నం చేశారు. ప్యాకేజీ విషయంలో రైతుల పోరాటం కొంతవరకు ఫలించినా, అది అమలు అవుతున్న తీరు, ఆ సందర్భంగా చంద్రబాబు ఇచ్చిన హామీలు నెరవేరని వైనం కళ్ల ముందు కనపడుతూనే ఉంది.రెండేళ్లుగా పంటలు వదలి భూములను బీడులుగా మార్చిన ఘనత ప్రభుత్వానికి దక్కింది.ఒక వైపు ప్రాజెక్టుల ద్వారా వేలఎకరాలకు నీళ్లు ఇచ్చి పంటలు పండిస్తామని చెప్పే ప్రభుత్వాలు మరోవైపు రెండు,మూడు పంటటలు పండే భూములను బలవంతంగా లాక్కోవడం ఏమిటో అర్దం కాదు.పిచ్చి వాస్తు నమ్మకాలతో ప్రభుత్వ భూములను ,అటవీ భూములను వదలి , బంగారం వంటి పంటలు పండే భూములను లాక్కొని అదేదో తమ ఘనత అని చాటుకున్నారు.భూములు ఇవ్వకపోతే పంటలను ప్రభుత్వమో,అధికార పార్టీవారో దగ్దం చేయడం వంటి దురాగతాలకు పాల్పడ్డారు.అంతేకాదు .చేతిలోఉన్న పోలీసు వ్యవస్థను భూములు ఇవ్వడానికి వ్యతిరేకత తెలిపిన రైతులపై ప్రయోగించడానికి వెనుకాడకుండా రాక్షసత్యంగా వ్యవహరించారు.భూములు ఇవ్వకపోతే చట్టం ప్రకారం లాక్కొంటామని, అప్పుడు పరిహారం కూడాసరిగా రాదని బెదరించారు.ప్రజా రాజధానికి ఇంత ఒత్తిడి అవసరమా?అప్పట్లో ప్రభుత్వ ప్రదాన కార్యదర్శిగా ఉన్న ఐవైఆర్ కృష్ణారావు ఇప్పుడు అదంతా రియల్ ఎస్టేట్ వ్యాపారం కోసమేనని కుండబద్దలు కొట్టినట్లు చెబుతున్నారు.చంద్రబాబు ప్రభుత్వం ఏదో ఒక ప్రాంతానికి, ఏదో ఒక సామాజికవర్గానికి లాభం చేస్తున్నారన్న అనుమానాలు కలిగించేలా వ్యవహరిస్తున్నారన్న అనుమానం కలిగితే ఆ ప్రాంతానికి, ఆ సామాజికవర్గానికి కూడా నష్టం కలుగుతుంది. చంద్రబాబు ఏదో చేసేస్తారన్న నమ్మకంతో అక్కడ పెద్ద ఎత్తున నిజంగానే నల్లధనం వెచ్చించి కోట్లు ఖర్చు చేసి భూములు కొన్నవారు లబోదిబో అంటున్నారు.కాకపోతే పైకి మాత్రం బింకంగా కనిపించే యత్నం చేస్తున్నారు.రాజధానిలో రైతులే కాదు,రైతు కూలీలకు కూడా ఎందుకు ఇప్పుడు సమస్యలు వస్తున్నాయి?వారి ఆదాయం ఎందుకు పడిపోయిందన్నది ప్రపంచ బ్యాక్ దృష్టికి కూడా వెళ్లింది.ఇదంతా జరిగినా, చంద్రబాబు తనకు ఉన్న పరపతో, మరొకటో వాడి ప్రపంచ బ్యాంక్ నుంచి తిరిగి రుణం పొందవచ్చు.అయినా ఇక్కడ ఒక విషయం గమనించాలి.ప్రభుత్వాలు అసత్యాల పునాదుల మీద ,అబద్దాల మేడలు కట్టి ప్రజలను భ్రమలలో పెట్టాలని ఆలోచించడమే ప్రజాస్వామ్య వ్యతిరేకం.ప్రభుత్వ,అటవీ భూములను వదలి ప్రైవేటు వ్యక్తుల భూములను బలవంతంగా తీసుకోవడం శోచనీయం. ముందుగా ప్రభుత్వ భూములు వాడుకుని ,వాటికి అనుబందంగా ఉండే ప్రైవేటు భూములను తప్పని సరి అయితే వాడుకుంటే అభ్యంతరం లేదు.తప్పు కూడా కాదు.కాని తాను పట్టిన కుందేటికి మూడే కాళ్లు అన్న చందంగా వ్యవహరించి ప్రభుత్వం మొండిగా వ్యవహరించడమే భాదకరం.ఇంత పెద్ద ఎత్తున ప్రచారం చేసుకున్న ప్రభుత్వం మూడున్నర ఏళ్లు గడుస్తున్నా,ఒక ఇటుక కూడా అక్కడ పెట్టలేక, అన్నీ తాత్కాలికం అంటూ వందల,వేల కోట్లు వెచ్చిస్తూ ప్రజా ధనాన్ని దుబారా చేయడం బాధాకరంగా ఉంటుంది.అయినా తనను ప్రశ్నించే దమ్ము ఎవరికి ఉందన్నది చంద్రబాబు ధైర్యం కావచ్చు.పరిస్థితి మారితే ప్రజలే ఎక్కడకక్కడ పాలకులను నిలదీస్తారు. చరిత్ర ఎప్పుడూ ఒకే రకంగా ఉండదు.తస్మాత్ జాగ్రత్త.

tags : amaravati,world bank

Latest News
*హీరో, డైరెక్టర్ ల ప్రతిఫలం లో 25% చెల్లించాలి..
*శ్రీధర్ బాబుపై కేసు కుట్రపూరితం
*రాజస్తాన్ లో అవినీతి ఆరోపణలే చేయరాదట
*ఆర్.కె.నగర్ డి.ఎమ్. కె అబ్యర్ది తమాషా డిమాండ్
*నాడు జైపాల్ రెడ్డి -నేడు రేవంత్ రెడ్డి !
*వి.హనుమంతరావు కూడా ఓకే చేశారు
*వైఎస్ తవ్వించిన కాల్వలవల్లే..బిజెపి నేత ప్రశంస
*పోలవరం ప్రాజెక్టులో భారీ నష్టం-రాయపాటి
*ఎమ్మెల్యే కి రేవంత్ రాజీనామా చేస్తే మంచిదే!
*జనసేన నేత అరెస్టు
*పోలవరాన్ని వ్యతిరేకించింది టిడిపినే-సిపిఐ
*మాజీ మంత్రి శ్రీధర్ బాబుపై కేసు-ఆడియో!
*టిడిపి బుట్టలో పడ్డ రేణుక- ఒక విశ్లేషణ
*ఆర్.కె.నగర్ నుంచి కమల్ పోటీ రిస్కేనా
*కసిఆర్ మళ్లీ ముఖ్యమంత్రి అవుతారు
*రేషన్ షాపులు ఎత్తివేయడం మంచిదేనా
*సిపిఎంలో ఏచూరి లైన్ కు పెరుగుతున్న ఆదరణ
*జడ్చర్ల నుంచి రేవంత్ పోటీచేస్తారా
*దుబాయిలో చంద్రబాబు
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info