A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
టిఆర్ఎస్ తో పొత్తు- రేవంత్ వర్గం గరంగరం
Share |
February 24 2018, 5:50 pm

టిఆర్ఎస్ తో టిడిపి పొత్తు వ్యవహారం పార్టీలో తీవ్ర కలకలం రేపుతోంది. టిడిపి అదినేత,ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు టిఆర్ ఎస్ తో పొత్తు ఉండదని స్పష్టంగా చెప్పకపోవడం పై రేవంత్ వర్గం ,టిఆర్ఎస్ లో కలవడానికి ఇష్టపడని నేతలు అసంతృప్తిగా ఉన్నారని వార్తలు వస్తున్నాయి.రేవంత్ తదితరులు దీనిపై ప్రత్యేకంగా సమావేశం కూడా జరిపారని సమాచారం వస్తోంది. ప్రస్తుత పరిణామాలు చూస్తుంటే టిఆర్ఎస్ తో పొత్తు ఉందన్న అనుమానాలు నిజమయ్యే అవకాశం ఉందని, అదే జరిగితే ముందే భవిష్యత్‌ నిర్ణయించుకోవడం మంచిదని వరంగల్‌ జిల్లాకు చెందిన సీనియర్‌ నేత ఒకరు ఈ భేటీలో అబిప్రాయపడ్డారట.కాగా పొత్తులో భాగంగా ఖమ్మం లోక్‌సభ సీటుతోపాటు 15 అసెంబ్లీ సీట్లు కేటాయించేందుకు సుముఖంగా ఉన్నట్లు టీఆర్‌ఎస్‌ నాయకత్వం నుంచి టీడీపీకి సంకేతాలు అందినట్లు జోరుగా ప్రచారం జరుగుతోందని కదనం.కాగా చంద్రబాబు సూచన మేరకే మోత్కుపల్లి నరసింహులు మరికొందరు టిఆర్ఎస్ తో పొత్తు ప్రతిపాదనను తెరపైకి తెచ్చారని దీనిని వ్యతిరేకించే నేతలు బావిస్తున్నారు.కాగా రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరతారని ప్రచారం ఉన్నా, ఆయన తొందరపడరాదని బావిస్తున్నారని చెబుతున్నారు.

tags : tdp,alliance, hot

Latest News
*రాహుల్ కన్నా ప్రియాంక బెటర్
*హిందువులు అదికంగా పిల్లల్ని కనాలి
*మరో వజ్రాల వ్యాపారి 389 కోట్లకు ముంచాడు
*విశాఖ సదస్సుకు కేంద్ర మంత్రులు వస్తారా
*ముఖ్యమంత్రిపైనే రేప్ ఆరోపణ
*తెలంగాణలో నిరుద్యోగుల భృతి యోచన
*బిజెపి ద్వేషాలు రెచ్చగొడుతోంది
*అమరావతి ప్రచారం అంతా ...చివరికి ఇది..
*కాకతీయ యూనివర్శిటీలో కొట్టుకున్నారు
*రజనీకాంత్ మళ్లీ సినిమా అంటున్నారు
*పిరాయింపుదారులు చెప్పేవన్నీ వాస్తవాలే
*ప్రముఖ పాత్రికేయుడి కన్నుమూత
*వైట్ హౌస్ బారికేడ్ లపైకి దూసుకెళ్లిన కారు
*బిజెపి మంత్రిని పిచ్చోడన్న తెలుగుదేశం నేత
*ఆ పత్రిక వార్త కరెక్టు కాదు
*వైసిపి రిప్లైపై పవన్ కళ్యాణ్ స్పందించలేదేమి!
*హరిబాబుతో గంటా బేటీ-ఆంతర్యం
*ప్రపంచంలోనే అత్యుత్తమంగా అమరావతి-బాబు
*విచారణకు రాని రామ్ గోపాల్ వర్మ
*చేతులు కాలాక కేంద్ర ఆర్దిక శాఖ మేలుకొంది
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info