A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
టిడిపి ఎమ్మెల్సీ పోర్జరీ మోసం - ఎంత ఘోరం
Share |
December 11 2017, 4:39 pm

తెలుగుదేశం ఎమ్మెల్సీ దీపక్ రెడ్డి మరో ఫోర్జరీ వ్యవహారంలో చిక్కుకున్నారన్న సమాచారం వచ్చింది.ఆయన ఒక మహిళపై కక్షబూని ఆమె సంతకాలే ఫోర్జరీ చేసి ఆమెపైనే సివిల్ దావా వేశారట.ఆమె చేసిన ఫిర్యాదుపై స్పందించిన పోలీసులు సంబందిత పత్రాలను పోరెన్సిక్ లాబ్ కు పంపించగా, పోర్జరీ నిర్ధారణ అయిందని కధనం.భూకబ్జా కేసులో బెయిల్ పై ఉన్న దీపక్ రెడ్డికి ఈ కేసులో కూడా నోటీసులు వెళుతున్నాయి.సాక్షి మీడియాలో వచ్చిన ఈ కధనం చదివితే ఆశ్చర్యంగా ఉంటుంది. దీపక్ రెడ్డి వంటి వారు ఎలాంటి మోసాలకు పాల్పడే అవకాశం ఉందో అర్దం అవుతుంది. ఆ కదనం వివరాలు ఇలా ఉన్నాయి.

బంజారాహిల్స్‌కు చెందిన పద్మావతి 2012లో బాచుపల్లి ప్రాంతంలో రెండు క్రషర్‌ ప్లాంట్లు నిర్వహించారు. వీటికి ముడిసరుకును దీపక్‌రెడ్డి తన గ్రేట్‌ ఇండియా మైనింగ్‌ సంస్థ ద్వారా సరఫరా చేశారు. ఈ నేపథ్యంలో వీరి మధ్య ఆర్థిక లావాదేవీలకు సంబంధించి వివాదం రేగింది. దీంతో దీపక్‌రెడ్డి అనుచరులు క్రషర్‌ ప్లాంట్‌లోకి దౌర్జన్యంగా ప్రవేశించి, సామగ్రి ఎత్తుకెళ్లారు. పద్మావతి ఫిర్యాదుతో దుండిగల్‌ పోలీసులు రెండు కేసులు నమోదు చేశారు. పద్మావతిపై కక్షకట్టిన దీపక్‌రెడ్డి.. ఆమె క్రషర్‌ ప్లాంట్లను సొంతం చేసుకోవాలని భావించారు. బాచుపల్లిలోని ప్లాంట్‌ విక్రయించేందుకు పద్మావతి రూ.5 లక్షల అడ్వాన్స్‌ తీసుకుని అగ్రిమెంట్‌ కమ్‌ సేల్‌ డీడ్‌ చేసినట్లు నకిలీ పత్రాలు సృష్టించారు. దీనిపై పద్మావతి సంతకాన్ని ఫోర్జరీ చేశారు. వీటి ఆధారంగా దీపక్‌రెడ్డి సిటీ సివిల్‌ కోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు.న్యాయస్థానం నుంచి నోటీసు అందుకున్న పద్మావతి అవాక్కయ్యారు. తాను ఎవరితోనూ ఎలాంటి అగ్రిమెంట్‌ చేసుకోలేదని, తన సంతకాన్ని ఫోర్జరీ చేశారని కోర్టుకు విన్నవించడంతో ఈ పిటిషన్‌ డిస్మిస్‌ అయింది. తన సంతకాలను ఫోర్జరీ చేసిన వారిపై చర్యలు తీసుకునేలా పోలీసుల్ని ఆదేశించాలని ఆమె కోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. కోర్టు ఆదేశాల మేరకు దీపక్‌రెడ్డిపై బంజారాహిల్స్‌ ఠాణాలో 2014లో కేసు నమోదైంది.అని ఈ కదనం వివరించింది.

tags : deepakreddy,forgery

Latest News
*విజయ్ ఆత్మహత్య కేసులో పారిశ్రామికవేత్త పేరు
*కెసిఆర్ వియ్యంకుడు అక్రమ రిజర్వేషన్ పొందారు
*పోలవరం లో ఇంత గందరగోళమా- బుగ్గన
*చైతన్యబారతి కాలేజీలో ఉద్రిక్తత
*ప్రకాష్ రాజ్ పై ఇతర రాష్ట్రాలకు కోపం వస్తుందేమో
*జగన్ చుట్టూ పద్మవ్యూహం అల్లినా..
*పటేళ్ల పోస్టర్లు- బిజెపి గిజగిజ
*వంట గ్యాస్ ధరలు ఈ ఒక్క నెల పెరగలేదంటే..
*సోనియాగాందీనే సస్పెండ్ చేయాలట
*పోలవరంలో పెరిగిన అంచనా ప్రజలపై వేయరాదు
*పట్టిసీమ ప్రచారం- తెలంగాణకు పెద్ద అస్త్రం !
*సుప్రింకర్టుకు వెళతామంటున్న మంత్రి
*ఎట్టకేలకు భరత్ రెడ్డి అరెస్టు?
*ఇక కాంగ్రెస్ అద్యక్షుడు రాహుల్ గాంధీ
*ఒకరు ఒకే చోట పోటీచేయాలా-పిల్
*పోలవరం బిల్లులు పెండింగులో ఉండవు-గడ్కరి
*కమెడియన్ విజయ్ ఆత్మహత్య
*మోడీకి పాకిస్తాన్ జవాబు
*పవన్ కళ్యాణ్ పై ఎన్నో సందేహాలు
*అవినీతి గత ఏడాది కాలంలో తగ్గలేదా
* త్రిపుల్ తలాఖ్ పై హిస్టరీ పేపర్ లో ప్రశ్నలు
*నోట్ల రద్దు, జిఎస్టి ప్రభావం మరో రెండేళ్లు
*బిసి రిజర్వేషన్ లు-ఇదేనా బిజెపి చిత్తశుద్ది
*తెలుగు మహాసభలు-50 కోట్ల ఖర్చా
*రాహుల్ ఆ ఫైల్ పైనే సంతకం చస్తారు
*ఇళ్లు-ఎపికి కేంద్రం అన్యాయం- జ్యోతి
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info