A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
ముందస్తు బెయిల్ కోసం నటుడి పిటిషన్
Share |
February 21 2018, 7:03 pm

తమిళనటుడు సంతానంపై దౌర్జన్యం కేసు నమోదు అయింది. షణ్ముక సుందరం అనే కాంట్రాక్టర్ తో కలిసి సంతానం ఒక కళ్యాణ మండపం నిర్మించాలని తలపెట్టారు. అందుకోసం డబ్బు కూడా కొంత సుందరానికి ఇచ్చాడట. ఆ తర్వాత ఆ ప్రతిపాదన విరమించుకున్నారు. కాని షణ్ముక సుందరం మాత్రం తన డబ్బు ఇవ్వడం లేదని ఆయన ఆరోపణ.దీనిపై డబ్బు అడగడానికి మేనేజర్ తో కలిసి షణ్ముగ సుందరం వద్దకు వెళ్లినప్పుడు ఇద్దరి మధ్య మాట,మాట పెరిగి, ఘర్షణ ఏర్పడింది. ఆ సమయంలో అక్కడ షన్ముగం లాయర్ పై కూడా సంతానం చేయి చేసుకున్నారట. ఆయన బిజెపి నేత కావడంతో ఆ పార్టీ నేతలు కూడా రంగప్రవేశం చేశారు.కాగా షన్ముఖ సుందరపై సంతానం ఫిర్యాదు చేయగా, సంతానంపై కూడా కేసు పెట్టాలని బిజెపి కార్యకర్తలు డిమాండ్ చేశారు.దాంతో పోలీసులు నటుడు సంతానంపై కూడా వివిధ సెక్షన్ ల కింద కేసు నమోదు చేశారు.కాగా సంతానం ముందస్తు బెయిల్ కోసం పిటిషన్ దాఖలు చేశారు.

tags : santana, case

Latest News
*కాంగ్రెస్ పార్టీ బస్ యాత్ర,పాదయాత్రలు
*జియో ద్వారా లక్ష ఉద్యోగాలు
*పవన్ అవిశ్వాసం అయితే ఓకే-టిడిపి మంత్రి
*టిడిపి,బిజెపి మంత్రులు నాటకాలు ఆడుతున్నారు
*కమల్ హసన్ రాజకీయ యాత్ర ఆరంభం
*ఆడిటర్లు ఏమి చేస్తున్నారు-జైట్లి ప్రశ్న
*హైదరాబాద్ ఆస్తుల్ని అమ్ముతున్న ఎపి ప్రభుత్వం
*అధికారం ఉంటే కళ్లు నెత్తికెక్కుతాయి
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info