A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
కమల్ హసన్ నీ సంగతేమిటి? - మంత్రులు
Share |
September 21 2017, 4:57 am

ప్రముఖ నటుడు కమల్ హసన్ పై అన్నా డి.ఎమ్.కె. మంత్రులు, ఎమ్మెల్యేలు విరుచుకుపడ్డారు. తమిళనాడులో అవినీతి పై కమల్ హసన్ తీవ్రంగా విమర్శిస్తూ ముఖ్యమంత్రి పళనిసామి రాజీనామా చేయాలని కొద్ది రోజుల క్రితం కమల్ అన్నారు.దీనిపై మండిపడ్డ మంత్రులు ఉదయకుమార్,బాలకృష్ణారెడ్డి తదితరులు స్పందించారు. ఓ కార్మికుడు నెలంతా కష్టపడిన రూ.10వేలుపైగా సంపాదించలేడని, అయితే నటులు ఒక్కో సినిమాకు రూ.25 కోట్లు, రూ.50 కోట్లు పారితోషికంగా తీసుకుంటున్నారని తెలిపారు. ఆ డబ్బులకు సక్రమంగా పన్నులు చెల్లిస్తున్నారా? అని ప్రశ్నించారు. కమల్‌హాసన్‌ కుమార్తెలు పన్నులు కడుతున్నారా? అనే విషయాన్ని స్పష్టం చేయాలని వారు ప్రశ్నించారు. కమల్‌హాసన్‌ సొంత ప్రచారం కోసం ఇలా అసత్యం పలుకుతున్నారని అన్నారు. రాజకీయ ఆకాంక్ష ఉంటే వెంటనే కమల్‌ రాజకీయాల్లోకి రావాలని, అది మానుకుని ఇలా ఆరోపణలు చేయడం సబబుకాదని తెలిపారు. కమల్‌ ఆత్మపరిశీలన చేసుకోవాలని, వ్యక్తిగత క్రమశిక్షణ ఆయనకు ఉందా? అనే ప్రశ్నకు ఆయనే సమాధానం చెప్పుకోవాలని వారు ద్వజమెత్తారు.

tags : kamal hasan, ministers, aiadmk

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info