A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
రోజా పంచ్ డైలాగులు
Share |
May 23 2018, 6:31 am

ప్రముఖ నటి, వైఎస్ ఆర్ కాంగ్రెస్ ఎమ్మెల్యే రోజా పంచ్ డైలాగులతో నంద్యాల ఓటర్లను ఆకట్లుకునే యత్నం చేశారు.ఉప ఎన్నిక ప్రచారం సందర్భంగా ఆమె ప్రసంగిస్తూ నంద్యాల ఓటర్ల దెబ్బకు ముఖ్యమంత్రి చంద్రబాబు అబ్బా అని అనాలని ఆమె అన్నారు. ఎవరు కొడితే దిమ్మతిరిగి మైండ్‌ బ్లాంక్‌ అవుతుందో వాళ్లే నంద్యాల ప్రజలు అని ఆమె అన్నారు.నంద్యాల ప్రజలకు అందరికన్నా ముందు అవకాశం వచ్చిందని, అన్ని విషయాలలోను మోసం చేస్తున్న చంద్రబాబుకు బుద్ది చెప్పే అవకాశం నంద్యాల ఓటర్లకు వచ్చిందని ఆమె అన్నారు.బాబు వెన్నుపోటుకు, జగన్‌ విశ్వసనీయతకు మధ్య ఎన్నిక జరుగుతుంది. చంద్రబాబు ఒత్తిడితోనే భూమా నాగిరెడ్డి చనిపోయారు. శోభా నాగిరెడ్డి చివరి రక్తపు బొట్టు వరకూ చంద్రబాబుకు వ్యతిరేకంగా పోరాడారు. కానీ ఇప్పుడు అఖిలప్రియ అవేమీ పట్టించుకోకుండా చంద్రబాబు పంచన చేరారని రోజా వ్యాఖ్యానించారు.

tags : roja,punch dilogues

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info