A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
టిపిపిఎస్సి సభ్యులకు 3 రెట్టు జీతం పెంచుతారా
Share |
August 17 2017, 1:23 pm

రాష్ట్రంలో ఉద్యోగులు, కార్మికులకు ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా నిర్లక్ష్యం చేస్తున్న ప్రభుత్వం వరుస వైఫల్యాలతో రాష్ట్ర ప్రతిష్టను దిగజారుస్తున్న టి ఎస్ పి ఎస్ సి సభ్యుల జీతాలను మాత్రం మూడు రెట్లు పెంచి, 30 లక్షల నజరానతో ఇవ్వాలని నిర్ణయించడం ప్రభుత్వ పక్షపాత ధోరణికి నిదర్శనమని టిటిడిపి వర్కింగ్ ప్రెసిడెంట్ ఎ. రేవంత్ రెడ్డి ధ్వజమెత్తారు. నచ్చితే నజరాన..నచ్చకపోతే జరిమాన అనే రితీలో సిఎం నిర్ణయాలు తీసుకుంటున్నారని ఆయన దుయ్యబట్టారు. టిఎస్ పి ఎస్ సి సభ్యుల వేతనాలను రూ. 80 వేల నుంచి రూ. 2.25 లక్షలకు పెంచడం, వాటిని 2016 జనవరి 1 నుంచి అమలు చేయాలని నిర్ణయిస్తూ ఉత్తర్వులు జారీ చేసిన నేపథ్యంలో శనివారం
మీడియాకు విడుదల చేసిన ప్రకటనలో రేవంత్ రెడ్డి తప్పుపట్టారు. టిఎస్ పి ఎస్ సి సభ్యుల పెంచాలన్న ప్రభుత్వ నిర్ణయంపట్ల ఆశ్చర్యాన్ని వ్యక్తం చేశారు. జీతాలు భారీగా పెంచాల్సినంత ఘనకార్యం వాళ్లు ఏం చేశారని ప్రశ్నించారు. రాష్ట్రంలో లక్ష 7 వేల ప్రభుత్వ ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని వాటిని భర్తీ చేస్తామని సిఎం అసెంబ్లీ సాక్షిగా చెప్పారని అయితే సిఎం హామీని కార్యరూపంలోకి తెవడానికి టిఎస్ పి ఎస్ సి
ఇంతవరకు కనీస చర్యలు తీసుకోలేదని అందుకు వారికి బహుమతిగా జీతాలు పెంచారా? తెలంగాణ నిరుద్యోగుల జీవితాలతో చెలగాటం ఆడుతున్నందుకు జీతాలు పెంచారా? అని ఎద్దేవాచేశారు. టిఎస్ పి ఎస్ సి గత మూడేళ్ల కాలంలో జారీ చేసిన నోటిఫికేషన్లు, నియామకాలు అన్నీకూడ వివాదాస్పదం అయ్యాయని ఆయన గుర్తుచేశారు. టిఎస్ పి ఎస్ సి అవగాహన రాహిత్యం కారణంగా ఎన్నో వివాదాలు ఉత్పన్నం అయ్యాయని ఫలితంగా నిరుద్యోగుల పరిస్థితి ఆందోళనకరంగా మారిందని విమర్శించారు.

tags : revanth, tppsc,salaries,hike

Latest News
*చదువు ఒత్తిడి తట్టుకోలేక ఆత్మహత్య
*టిడిపి కార్యకర్తను బాలకృష్ణ కొట్టారు
*వరంగల్ టెక్స్ టైల్ పార్కుకు కొరియా సంస్థలు
* వడ్డీ వ్యాపారుల కోరలలోనే ఎపి,టి.రైతులు
*కమల్ హసన్ నీ సంగతేమిటి? - మంత్రులు
*ఎపికి 20 మెడికల్ కాలేజీలు అంటున్న బాబు
*కోమటిరెడ్డి సోదరుల తిరుగుబాటు స్వరం
*ఎయిర్ హోస్టెస్ అనుమానాస్పద మృతి
*కృష్ణా జిల్లాలో దారుణ హత్యలు
*టిడిపిలోకి గంగుల ప్రతాప్ భూమా వర్గానికి షాక్
*నంద్యాల ఉప ఎన్నికను రద్దు చేయాలి
*బిజెపిలోకి మాజీ సి.ఎమ్.
*తెలంగాణలో ఉద్యోగాలపై యాక్షన్ ప్లాన్
*సాగర్ లో ఎన్నడూ లేని విదంగ కనిష్ట నీటి మట్టం
*రోజా పంచ్ డైలాగులు
*చంద్రబాబుకు టిడిపి ఎమ్మెల్యే హెచ్చరిక
*కాపుల చెవిలో క్యాబేజీ పువ్వు పెట్టారు
*తెలుగుదేశంలోకి మాజీ కాంగ్రెస్ ఎమ్.పి
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info