A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
ఎపికి కేంద్ర సంస్థలను మంజూరు చేసినా నిదులు..
Share |
August 17 2017, 1:26 pm

ఎపికి కేంద్ర ప్రభుత్వం గత మూడేళ్లలో మంజూరు చేసిన సంస్థలకు మౌలిక వసతులు కల్పించడానికి తగు నిదులు కేటాయించకపోవడంతో అవన్ని అద్దె వసతులలో నడుస్తున్నాయి. కేంద్రం వాటికి దశల వారీగా నిదులు ఇస్తుండడంతో అవన్ని పూర్థి స్థాయిలో పనిచేయడానికి పది నుంచి పదిహను సంవత్సరాలు పట్టవచ్చని అబిప్రాయపడుతున్నారు.విశాఖలో ఐఐఎమ్, తాడేపల్లిగూడెంలో ఎన్.ఐ.టి. , తిరుపతిలో సైన్స్ ఇన్ స్టిట్యూట్ , శ్రీసిటీలో త్రిబుల్ ఐటి, నెల్లూరులో ఏర్పాటుచేసిన టూరిజం అండ్ ట్రావెల్ మేనేజ్ మెంట్ సంస్థ మొదలైనవాటికి రాష్ట్ర ప్రభుత్వం స్థలాలు కేటాయించి గోడలు కట్టించింది.కాని ఆ తర్వాత వాటి నిర్మాణానికి అవసరమైన నిధులను కేంద్రం ఇవ్వకపోవడంతో అవన్ని అరకొర వసతులతో నడుస్తున్నాయి.దీనిపై రాష్ట్రం కూడా కేంద్రం పై ఒత్తిడి చేయలేకపోతోంది.మంత్రి గంటా శ్రీనివాసరావును ఈ పరిస్థితి గురించి ప్రశ్నించితే, తాము కేంద్రాన్ని నిధుల గురించి విజ్ఞప్తి చేశామని అన్నారు.ఆయా సంస్థలు రుణాలు తీసుకోవడానికి అవకాశం ఇచ్చి బ్యాంక్ గ్యారంటీలను కేంద్రం ఇవ్వాలని కోరబోతున్నామని మంత్రి వివరించారు.విశాఖ ఐఐఎమ్ కు వెయయి కోట్లు, టిపిగూడెం ఎన్ ఐటికి 300 కోట్లు, తిరుపతి సైన్స్ కేంద్రానికి 450 కోట్లు కేటాయించినా నిదులు అవసరమైన రావడం లేదని చెబుతున్నారు.

tags : center,funds

Latest News
*చదువు ఒత్తిడి తట్టుకోలేక ఆత్మహత్య
*టిడిపి కార్యకర్తను బాలకృష్ణ కొట్టారు
*వరంగల్ టెక్స్ టైల్ పార్కుకు కొరియా సంస్థలు
* వడ్డీ వ్యాపారుల కోరలలోనే ఎపి,టి.రైతులు
*కమల్ హసన్ నీ సంగతేమిటి? - మంత్రులు
*ఎపికి 20 మెడికల్ కాలేజీలు అంటున్న బాబు
*కోమటిరెడ్డి సోదరుల తిరుగుబాటు స్వరం
*ఎయిర్ హోస్టెస్ అనుమానాస్పద మృతి
*కృష్ణా జిల్లాలో దారుణ హత్యలు
*టిడిపిలోకి గంగుల ప్రతాప్ భూమా వర్గానికి షాక్
*నంద్యాల ఉప ఎన్నికను రద్దు చేయాలి
*బిజెపిలోకి మాజీ సి.ఎమ్.
*తెలంగాణలో ఉద్యోగాలపై యాక్షన్ ప్లాన్
*సాగర్ లో ఎన్నడూ లేని విదంగ కనిష్ట నీటి మట్టం
*రోజా పంచ్ డైలాగులు
*చంద్రబాబుకు టిడిపి ఎమ్మెల్యే హెచ్చరిక
*కాపుల చెవిలో క్యాబేజీ పువ్వు పెట్టారు
*తెలుగుదేశంలోకి మాజీ కాంగ్రెస్ ఎమ్.పి
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info