A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
కోదండరామ్ కాంగ్రెస్ వారిలా ఆలోచిస్తున్నారు
Share |
December 13 2017, 3:12 am

తెలంగాణ జెఎసి చైర్మన్ కోదండరామ్ పై మంత్రి పోచారం శ్రీనివాసరెడ్డి విరుచుకుపడ్డారు. యాత్రల పేరుతో కోదండరామ్ వ్యవహరిస్తున్న తీరు సరిగా లేదని ఆయన అన్నారు. అచ్చం కాంగ్రెస్ వారిలానే కోదండరామ్ కూడా ఆలోచన చేస్తున్నారని ఆయన ఆరోపించారు. ప్రాజెక్టుల నిర్మాణానికి కోదండరామ్ అడ్డుపడడానికి ప్రయత్నిస్తున్నారని, దానికి కడుపు మండిన రైతులే ఆయనను అడ్డుకునే యత్నం చేశారని మంత్రి పోచారం అన్నారు. ఉద్యమ నేతగా ముఖ్యమంత్రి కేసీఆర్ ఉన్నప్పుడే తెలంగాణా సాగునీటి అవసరాలు తీర్చే ప్రణాళిక వేశారని ఆయన అన్నారు. కాంగ్రెస్ నేతలు జేబులు నింపుకోవడానికే సాగునీటి ప్రాజెక్టులు చేపట్టారు తప్ప.. ప్రజల కడుపు నింపడానికి కాదన్నారు.

tags : pocharam, kodandaram, congress

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info