A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
దక్షిణాదికి బిజెపి ఇన్ చార్జీగా రామ్ మాదవ్
Share |
December 13 2017, 3:19 am

భారతీయ జనతా పార్టీ ప్రధాన కార్యదర్శి రామ్ మాదవ్ కు దక్షిణాది రాష్ట్రాల బాద్యతలు అప్పగించవచ్చని ప్రచారం జరుగుతోంది. ఇంతకాలం ప్రత్యక్షంగానో, పరోక్షంగానో ప్రస్తుతం ఉప రాష్ట్రపతి అయిన సీనియర్ నేత వెంకయ్య నాయుడు పర్యవేక్షిస్తుండేవారు. అన్ని దక్షిణాది రాష్ట్రాల నేతలతో ఆయన టచ్ లో ఉండేవారు. ఆయన బాద్యతలు మారడంతో కొత్త నేతకు బాద్యతలు అప్పగించవచ్చని చెబుతున్నారు.అందులో రామ్ మాదవ్ పేరు ముందు భాగాన ఉందని అంటున్నారు. రామ్ మాధవ్ ఇప్పుడు జమ్ము-కశ్మీర్ రాష్ట్రం, ఈశాన్య రాష్ట్రాలకు పార్టీ ఇన్ చార్జీగా ఉన్నారు. ఇటీవల ఆయన తెలంగాణ బిజెపి కార్యవర్గ సమావేశానికి కూడా హాజరయ్యారు.ఆ సందర్భంగా పార్టీ ఎదుగుదలకు ఆయన కొన్ని సూచనలు చేశారు. ఎపిలో కన్నా లక్ష్మీనారాయణ పార్టీలోకి రావడానికి ఆయనే చొరవ తీసుకున్నారు. తెలంగాణలో బిజెపి ఒంటరిగానే వచ్చే ఎన్నికలలో పోటీచేయాలని భావిస్తోంది. ఎపిలో ప్రభుత్వంలో ఉన్నందున ఇంకా ఏ నిర్ణయం తీసుకోలేదు. అయితే అధిక సీట్లు కావాలని రాష్ట్ర బిజెపి నేతలు కొందరు కోరుతున్నారు. వీటన్నిటిని రామ్ మాదవ్ అయతే గట్టిగా డీల్ చేస్తారన్న వాదన ఉంది. కర్నాటకలో కూడా ఒక వర్గం రామ్ మాధవ్ ను ఇన్ చార్జీగా పంపాలని కోరుతోంది. ఈ నేపద్యంలో అమిత్ షా త్వరలోనే దీనిపై నిర్ణయం తీసుకోవచ్చని భావిస్తున్నారు.

tags : ram madhav,bjp,incharge

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info