A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
నంద్యాల -వైసిపి కి వామపక్షాల పరోక్ష మద్దతు
Share |
December 13 2017, 3:12 am

నంద్యాల ఉప ఎన్నికలో వైఎస్ ఆర్ కాంగ్రెస్ కు వామపక్ష సిపిఐ, సిపిఎం లు పరోక్ష మద్దతు ఇచ్చాయని అనుకోవచ్చు.నంద్యాల ఉప ఎన్నికలో తెలుగుదేశం పార్టీని ఓడించాలని ఆ పార్టీ కార్యదర్శులు కె.రామకృష్ణ, పి.మధులు పిలుపు ఇచ్చారు.వారు సంయుక్తంగా ఈ మేరకు ఒక ప్రకటన విడుదల చేశారు. ఎన్నికల్లో ఇచ్చిన వాగ్దానాలను అమలు చేయకుండా ప్రజలను టీడీపీ మోసగిస్తోందన్నారు. హద్దూపద్దు లేని వాగ్దానాలు చేసి అధికారంలోకి వచ్చిన టీడీపీ ప్రజలను అన్ని రంగాల్లో అసంతృప్తి పరిచిందని వారు వ్యాఖ్యానించారు. ప్రత్యేక హోదాపై ద్రోహం చేశారని, రాయలసీమ,ఉత్తరాంద్రలకు ఇస్తామన్న రాయితీలు ఇవ్వడం లేదని, వారు విమర్శించారు. ఎపి ప్రభుత్వంలో అవినీతి, లంచగొండితనం, పార్టీ ఫిరాయింపులు పెరిగిపోయాయని వారు పేర్కొన్నారు.అధికార టీడీపీ, బీజేపీ కూటమిని నంద్యాల ఉప ఎన్నికల్లో ఓడించి ప్రభుత్వ పాలనపట్ల నిరసన తెలియజేయాలని రామకృస్ణ, మధులు విజ్ఞప్తి చేశారు.

tags : nandhyala, ycp, left parties, support

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info