A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
పార్టీ మారను బాబో అంటున్న సీనియర్ నేత
Share |
August 17 2017, 1:25 pm

ఒక్కో వార్త భలే చికాకు పెడుతుంది. ప్రస్తుతం సీనియర్ నేత ,రాజ్యసబ సభ్యుడు డి.శ్రీనివాస్ పరిస్థితి అలాగే అయింది. ఆయనను టిఆర్ఎస్ లో పెద్దగా పట్టించుకోవడం లేదని, అందువల్ల కాంగ్రెస్ లోకి మళ్లీ వెళ్లవచ్చని మీడియాలో వార్తలు వచ్చాయి.ఆ వార్త ఎలా వచ్చిందో కాని, అప్పటి నుంచి డి.శ్రీనివాస్ దానిని కండించడానికి తంటాలు పడవలసి వస్తోంది.
టీఆర్‌ఎస్‌ను వదిలిపెట్టి తిరిగి కాంగ్రెస్‌లోకి వెళ్తున్నట్టు జరుగుతున్న ప్రచారం అవాస్తవమని ఆయన అన్నారు. టిఆర్ఎస్ ను వదలే ప్రసక్తి లేదని ఆయన స్పష్టం చేశారు.
తానంటే గిట్టని కొంతమంది నేతలు పనిగట్టుకుని ఉద్దేశపూర్వకంగా ఇలాంటి కుట్రలు, ప్రచారం చేస్తున్నారని అన్నారు. తాను కాంగ్రెస్‌నేతలు ఎవరినీ కలవలేదని, ఎవరితోనైనా మాట్లాడి ఉంటే బయటపెట్టాలని డీఎస్‌ డిమాండ్‌ చేశారు. తాను పార్టీ మారుతున్నట్టుగా టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి వంటి నాయకుడు చెబుతాడని అనుకోవడంలేదని ఆయన అన్నారు. ఇలాంటి వార్తల వల్ల తన విశ్వసనీయత పోతుందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.

tags : ds,trs, defection,denial

Latest News
*చదువు ఒత్తిడి తట్టుకోలేక ఆత్మహత్య
*టిడిపి కార్యకర్తను బాలకృష్ణ కొట్టారు
*వరంగల్ టెక్స్ టైల్ పార్కుకు కొరియా సంస్థలు
* వడ్డీ వ్యాపారుల కోరలలోనే ఎపి,టి.రైతులు
*కమల్ హసన్ నీ సంగతేమిటి? - మంత్రులు
*ఎపికి 20 మెడికల్ కాలేజీలు అంటున్న బాబు
*కోమటిరెడ్డి సోదరుల తిరుగుబాటు స్వరం
*ఎయిర్ హోస్టెస్ అనుమానాస్పద మృతి
*కృష్ణా జిల్లాలో దారుణ హత్యలు
*టిడిపిలోకి గంగుల ప్రతాప్ భూమా వర్గానికి షాక్
*నంద్యాల ఉప ఎన్నికను రద్దు చేయాలి
*బిజెపిలోకి మాజీ సి.ఎమ్.
*తెలంగాణలో ఉద్యోగాలపై యాక్షన్ ప్లాన్
*సాగర్ లో ఎన్నడూ లేని విదంగ కనిష్ట నీటి మట్టం
*రోజా పంచ్ డైలాగులు
*చంద్రబాబుకు టిడిపి ఎమ్మెల్యే హెచ్చరిక
*కాపుల చెవిలో క్యాబేజీ పువ్వు పెట్టారు
*తెలుగుదేశంలోకి మాజీ కాంగ్రెస్ ఎమ్.పి
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info