A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
నిరసనల మద్య బిల్లులు ఓకే చేయను-వెంకయ్య
Share |
December 13 2017, 3:10 am

నిరసనలు ,గందరగోళం మద్య సభలో బిల్లులు ఆమోదించడానికి తాను వ్యతిరేకమని ఉప రాష్ట్రపతి ,రాజ్యసభ చైర్మన్ వెంకయ్య నాయుడు చెప్పారు.రాజ్యసభలో ఆయన మాట్లాడారు.సభలో ఆయా అంశాలపై చర్చలు జరగాలని,తరచుగా సభకు అంతరాయం కలగరాదని ఆయన సూచించారు.సభలో ఉన్న ఆయా ఎమ్.పిలు వేర్వేరు పార్లీల వారే కాని, శత్రువులు కారని వెంకయ్య అన్నారు.సభలో నిరసనలు, ఆందోళనల మద్య బిల్లులు ఆమోదించడాన్ని తాము అంగీకరించను అని ఆయన స్పష్టం చేశారు.. ఓ రైతు బిడ్డగా సభను నడిపించే అవకాశం రావటం గొప్ప అదృష్టమని వెంకయ్య తెలిపారు. ‘ఏదేమైనా.. దేశ సంస్కృతి (కల్చర్‌) వ్యవసాయమే (అగ్రికల్చర్‌) కదా’ అని ఆయన తెలిపారు.
‘చిన్నతనంలోనే తల్లిదండ్రులను కోల్పోయా. మా అమ్మ ముఖం కూడా నాకు గుర్తులేదని’ వెంకయ్య ఉద్వేగంగా పేర్కొన్నారు. తాను ఇప్పుడు అందరి వాడినని కూడా ఆయన అన్నారు.

tags : venkayya, rs,bills,protests

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info