A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
సినిమా టిక్కెట్ల జిఎస్టి తగ్గించాలి
Share |
December 13 2017, 3:14 am

జిఎస్టి రేట్లు అదికంగా ఉండడం వల్ల ప్రాంతీయ భాషా చిత్రాల మనుగడకు నష్టం వాటిల్లుతుందని ,వాటిని తగ్గించాలని దర్శక ,నిర్మాత కేతిరెడ్డి జగదీశ్వరరెడ్డి కోరారు. ఆయన కేంద్ర ఆర్దిక మంత్రి అరుణ్ జైట్లిని కలిసి ఈ మేరకు ఒక వినతిపత్రం ఇచ్చారు.ప్రస్తుతం కేంద్రం సినీ రంగానికి సంబందించి సినిమా టిక్కెట్లపై వంద రూపాయల లోపు అయితే 18శాతం, వంద మించిన ధర ఉన్న టిక్కెట్లపై 28 శాతం పన్ను విదిస్తున్నారు.దీనివల్ల ప్రాంతీయ చిత్రాలు బాగా నష్ట పోతున్నాయని ఆయన మంత్రికి వివరించారు. అన్ని ప్రాంతీయ చిత్రాలకు జీఎస్‌టీ రేటును 12 శాతంగా నిర్ణయించాలని, అప్పుడే చిన్న సినిమాలు, ప్రాంతీయ సినిమాలు బతుకుతాయని కేతిరెడ్డి విజ్ఞప్తి చేశారు.

tags : cinema, tickets, tax rates

Latest News
 
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info
 
window._taboola = window._taboola || []; _taboola.push({flush: true});